Home » Entertainment » Bigg Boss Season 6 Telugu Interesting Update
Entertainment

Bigg Boss Season 6 : బిగ్‌ బాస్‌ సీజన్ 6 గురించి స్టార్‌ మా నుండి వచ్చిన లీక్‌ అదిరి పోయింది

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: May 26, 2022 3:53 pm
Advertisement

Bigg Boss Season 6 : తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్‌ ముగిసిన రెండు రోజుల్లోనే రెగ్యులర్ బిగ్‌ బాస్ సీజన్‌ 6 కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. నాగార్జున వీడియో ను విడుదల చేయడం జరిగింది. గతంలో ఒక సీజన్‌ లో సామాన్యులకు అవకాశం అంటూ ప్రకటించారు. ఆ సమయంలో ముగ్గురు సామాన్యులకు అవకాశం ఇచ్చారు. ఆ ముగ్గురు సామాన్యుల్లో ఒకరు వెంటనే వెళ్లి పోగా ఇద్దరు మాత్రం కాస్త ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేశారు. సామాన్యులకు ఎంట్రీ అంటూ ప్రకటించినా కూడా ఒకరు ఇద్దరు బ్యాక్ గ్రౌండ్‌ బాగుండి.. రికమండేషన్ తో వచ్చారనే విమర్శలు వచ్చాయి.

Advertisement

ఇప్పుడు బిగ్‌ బాస్ సీజన్ 6 లో కూడా సామాన్యులకు ఛాన్స్ అంటూ నాగార్జున ప్రకటించి మీరు అదృష్టాన్ని పరీక్షించుకోండి అన్నాడు. అందుకు సంబంధించిన ప్రాసెస్ ను కూడా ప్రారంభించారు. ఇదే సమయంలో స్టార్‌ మా నుండి ఒక ఆసక్తికర విషయం ఒకటి మాకు అందింది. అది ఏంటీ అంటే బిగ్‌ బాస్ సీజన్ 6 ను ఆగస్టు మూడవ ఆది వారం ప్రారంభించబోతున్నారట. ఈ సారి సెట్‌ లో ఎక్కువ మార్పులు చేయకుండా గతంలో మాదిరిగానే ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట. ఈసారి బిగ్‌ బాస్ లో ఎంటర్‌ టైన్మెంట్స్ ను అందించే వారికి అవకాశం వచ్చే అవకాశం ఉందంటున్నారు.

bigg boss season 6 Telugu interesting update

Advertisement

మాకు అందిన సమాచారం ప్రకారం బిగ్‌ బాస్ నాన్‌ స్టాప్ లో సందడి చేసిన ఒకరు లేదా ఇద్దరికి కచ్చితంగా అవకాశం ఉంటుందట. అలాగే ఒక ట్రాన్స్‌ జెండర్ ను కూడా ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో మాదిరిగా ఒక ముంబయి ముద్దుగుమ్మ ను అందాల ఆరబోత కోసం ఎంపిక చేశారట. తెలుగు లో చాలా సినిమాల్లో నటించి బోల్డ్‌ బ్యూటీగా పేరు దక్కించుకున్న ఆమెను ఇప్పుడు ఈ షో కోసం భారీ పారితోషికం ఆఫర్‌ చేసి మరీ తీసుకున్నారట. ఇక గొడవలతోనే షో కు రేటింగ్‌ వస్తుంది. కనుక ఫైర్ బ్రాండ్స్ ను తీసుకోవాలని భావిస్తున్నారు. మొత్తానికి ఎంపిక పక్రియ దాదాపు గా పూర్తి అవ్వబోతుంది. కనుక సీజన్‌ 6 ను ఆగస్టు లో ఖచ్చితంగా ప్రారంభించే అవకాశం ఉంది.. నాగార్జున హోస్టింగ్‌ చేస్తాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి