Chiranjeevi Vs Rajinikanth : మరోసారి చిరంజీవి vs రజినీకాంత్..?
Chiranjeevi Vs Rajinikanth టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇద్దరూ ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగడం చాలా అరుదు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు గతంలో ‘భోళా శంకర్’
Chiranjeevi Vs Rajinikanth : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇద్దరూ ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగడం చాలా అరుదు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు గతంలో ‘భోళా శంకర్’, ‘జైలర్’ సినిమాల సమయంలో క్లాష్ అయ్యారు. అయితే ఆ పోటీలో ఫైనల్‌గా ఎవరు విజేతగా నిలిచారో ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హీరోలుగా ఎదుగుతున్న సమయంలోనే చిరంజీవి, రజనీకాంత్ కలిసి నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. ‘కాళీ’ సినిమాలో ఇద్దరూ స్నేహితులుగా కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మరోవైపు ‘బందిపోటు సింహం’లో రజనీకాంత్ హీరోగా నటిస్తే, చిరంజీవి విలన్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాలు రావడం సాధ్యపడకపోయినా.. వ్యక్తిగతంగా మాత్రం ఇద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతూనే వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు సీనియర్ హీరోలు ఒకే సమయంలో బాక్సాఫీస్ వద్ద ఎదురెదురుగా నిలిచే పరిస్థితి కనిపిస్తోందన్న టాక్ ఆసక్తిని పెంచుతోంది.
Chiranjeevi Vs Rajinikanth : మరోసారి చిరంజీవి vs రజినీకాంత్..?
Chiranjeevi Vs Rajinikanth జైలర్ 2 తర్వాత రజనీకాంత్.. చిరంజీవి సినిమాకు పోటీ ?
ముందుగా రజనీకాంత్ విషయానికి వస్తే.. ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి వాయిదా ఉండకూడదనే పట్టుదలతో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాపైనే పూర్తిగా దృష్టి పెట్టి పనిచేస్తున్నట్లు టాక్. మరోవైపు ఎన్నో రోజులుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న చిరంజీవి ‘విశ్వంభర’ను అక్టోబర్ 16న విడుదల చేసే ప్రతిపాదన దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అంటే ‘జైలర్ 2’ విడుదలైన మరుసటి రోజే ‘విశ్వంభర’ను తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరో ఎనిమిది రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. ఇదే జరిగితే రజనీకాంత్ ‘జైలర్ 2’, చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలు కేవలం ఒక్కరోజు తేడాతో థియేటర్లలోకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇద్దరు సూపర్‌స్టార్ల సినిమాలు ఇంత దగ్గరగా విడుదల కావడం సహజంగానే భారీ చర్చకు దారితీస్తుంది.
Chiranjeevi Vs Rajinikanth 2027 సంక్రాంతికి కూడా రజనీ vs చిరు పోటీ?
కథ ఇక్కడితో ముగిసిపోవడం లేదు. ‘జైలర్ 2’ తర్వాత రజనీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ సినిమాను 2027 సంక్రాంతి బరిలోకి దింపాలని నిర్మాత కమల్ హాసన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా సంక్రాంతి పండుగ సీజన్‌లో తలైవర్ రజనీకాంత్ సినిమా లేకపోవడంతో ఆయన అభిమానులు కొంత వెలితిగా ఫీల్ అవుతున్నారనే చర్చ ఉంది. అందుకే 2027 పొంగల్ సీజన్‌ను రజనీకాంత్ సినిమాతో ఫుల్‌ఫిల్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న మెగా 158ను కూడా 2027 సంక్రాంతి బరిలోనే విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే మరోసారి రజనీకాంత్, చిరంజీవి సినిమాలు ఒకే పండుగ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశం ఉంటుంది. అంటే ఒకవైపు రజనీకాంత్ ‘ధర్మన్’, మరోవైపు చిరంజీవి నటిస్తున్న మెగా 158.. ఇద్దరు మెగాస్టార్ స్థాయి హీరోలు సంక్రాంతి బరిలో తలపడే పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే ప్రస్తుతం ఇవన్నీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న అంచనాలు, చర్చల స్థాయిలోనే ఉన్నాయి. అధికారిక రిలీజ్ డేట్స్ ప్రకటించే వరకు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు.
పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్‌పై ఎప్పుడూ ఉత్కంఠే!
అయితే భారీ సినిమాల విషయంలో మేకర్స్ ప్రకటించిన తేదీలకు చివరి వరకు కట్టుబడి ఉంటారనే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. నిజానికి ‘జైలర్ 2’ ఆగస్టులోనే రావాల్సి ఉందనే టాక్ గతంలో వినిపించింది. అలాగే చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ కూడా ముందుగానే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అనేక కారణాలతో ఆ రిలీజ్ ప్లాన్లు మారిపోయాయి. అందుకే ఇప్పుడు మరోసారి రజనీ, చిరు సినిమాల రిలీజ్ డేట్స్‌పై వస్తున్న వార్తలను అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు వినిపిస్తున్న ప్లాన్లు నిజమై.. ‘జైలర్ 2’, ‘విశ్వంభర’ వరుసగా అక్టోబర్‌లో విడుదలైతే అది అరుదైన బాక్సాఫీస్ క్లాష్‌గా మిగిలే అవకాశం ఉంది. అదే విధంగా 2027 సంక్రాంతికి ‘ధర్మన్’, మెగా 158 ఒకేసారి బరిలోకి దిగితే ఆ పోటీ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే సంక్రాంతి సీజన్‌పై ఎన్నో పెద్ద సినిమాలు కన్నేశాయి. చివరకు ఏ సినిమాలు పండుగ బరిలో నిలుస్తాయి? ఎవరు రిలీజ్ డేట్ నుంచి తప్పుకుంటారు? ఎవరికి థియేటర్లు దక్కుతాయి? ఏ సినిమాల మధ్య నిజమైన క్లాష్ జరుగుతుంది? వంటి ప్రశ్నలకు సమాధానం మాత్రం రాబోయే రోజుల్లోనే తేలనుంది. మొత్తంగా చూస్తే.. రజనీకాంత్, చిరంజీవి సినిమాలు మరోసారి ఒకే సమయంలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశం ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతోంది. అయితే అధికారిక ప్రకటనలు వచ్చే వరకు ఈ రిలీజ్ డేట్‌లను ఖరారైనవిగా కాకుండా ప్రస్తుతం వినిపిస్తున్న ఇండస్ట్రీ టాక్‌గానే చూడాలి.







