Home » Entertainment » Bigg Boss Season 7 Contestants List
Entertainment

Bigg Boss 7 : బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ లిస్ట్ .. చివరి నిమిషంలో కొత్త పేర్లు ..!!

Authored By
aruna
The Telugu News | Published on: August 24, 2023, 11:00 am
Advertisement

Bigg Boss 7 : బుల్లితెరపై బిగ్ బాస్ షో కి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 వచ్చే నెల 3వ తారీకు నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు ప్రోమోలతో ఈ సీజన్ పై భారీ హైప్ క్రియేట్ చేశారు హోస్ట్ నాగార్జున. అయితే ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే అసలు ఎవర్రా వీళ్లంతా, వీళ్లంతా బిగ్ బాస్ కంటెస్టెంట్ లా, ఒకరు ఇద్దరు తప్ప అన్ని కొత్త మొహాలే, ఆ ఇద్దరు కూడా యూట్యూబ్ చూసేవాళ్లకు తెలుసు తప్ప నార్మల్ ఆడియన్స్ కు తెలియని తెలియదు అని అనిపిస్తుంది. కానీ తప్పదు మరి ఇప్పుడే కాదు ఇంతకుముందు జరిగిన సీజన్లో కూడా ఇదే పరిస్థితి. బిగ్బాస్ పై మోజు తీరిందో ఏమో కానీ పెద్ద సెలబ్రిటీలు ఎవరు బిగ్ బాస్ వైపు చూడడం లేదు.

Advertisement

టీవీ షోలు జబర్దస్త్ యాంకర్ బిగ్బాస్ వాళ్ళకి హిట్ అయ్యారు. ఒకప్పుడు బిగ్ బాస్ అంటే సెలబ్రిటీల రియాలిటీ షో. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా కనిపిస్తుంది. గతంలో సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ క్రమంలోనే సీజన్ 7 ను గట్టిగా ప్లాన్ చేశారు బిగ్ బాస్ యూనిట్. అయితే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ పేర్లను బిగ్ బాస్ రివీల్ చేయలేదు. ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ గత సీజన్ మాదిరిగా క్వారంటైన్ పరిస్థితులు లేవు కాబట్టి షో స్టార్ట్ అయ్యే ముందు రాత్రికి రాత్రి పేర్లు మార్చేయొచ్చు. అయితే కొంతమంది పేర్లు మాత్రం బాగా వినిపిస్తున్నాయి. అమర్ దీప్, కార్తికదీపం శోభా శెట్టి, ఆట సందీప్ లాంటి పేర్లు కాకుండా కొత్త పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

Bigg Boss season 7 contestants list

Advertisement

శుభశ్రీ రుద్రవీణ ఫేమ్, గుండమ్మ కథ నటి, అమర్ దీప్ చౌదరి, కార్తీకదీపం మోనిత, ఆట సందీప్, అంజలి ,పవన్ సుశాంత్ అనిల్ జిలా, గీతా గౌతమ్, మహేష్, అషూ రెడ్డి ఈ 12 మంది కంటెస్టెంట్లు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇక వీళ్ళతోపాటు కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లు బిగ్ బాస్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అందులో మొగలిరేకులు సాగర్, మోడల్ ప్రిన్స్ నా పేరు మీనాక్షి హీరో గౌతం కృష్ణ, అర్జున్ అంబటి, జబర్దస్త్ నరేష్, రియాజ్, హీరో శివాజీ, శ్వేత, షకీలా, యాంకర్ ప్రత్యూష టీవీ9, జానకి కలగనలేదు నటి ప్రియాంక జైన్ పేర్లు వినిపిస్తున్నాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి