Home » Entertainment » Bigg Boss Season 7 Interesting Update
Entertainment

Bigg Boss Season 7 : బిగ్ బాస్ 7 హోస్ట్‌ కన్ఫమ్.. ముగ్గురు కంటెస్టెంట్స్ కూడా..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: December 28, 2022 4:08 pm
Advertisement

Bigg Boss Season 7 : తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 కి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్లు స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. నాగార్జున సీజన్ 3 నుండి సీజన్ 6 వరకు కంటిన్యూస్ గా నాలుగు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్త సీజన్ కి ఆయన హోస్ట్‌ గా వ్యవహరించేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ విషయమై ఇప్పటికే ఆయన బిగ్ బాస్ నిర్వాహకులకు తేల్చి చెప్పారట, దాంతో కొత్త హోస్ట్ కోసం గత కొన్ని రోజులుగా సెర్చ్‌ చేస్తున్న బిగ్ బాస్ నిర్వాహకులు దాదాపుగా రానా దగ్గుబాటిని కన్ఫమ్ చేసినట్లుగా తెలుస్తుంది.

Advertisement

నందమూరి బాలకృష్ణను తీసుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు, ఇప్పటికే ఆయన అన్‌ స్టాపబుల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందుకే బిగ్ బాస్ కూడా ఆయనకు ఖచ్చితంగా సరిగ్గా సెట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు బాలకృష్ణ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాక పోవడంతో రానా ను కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. కంటెస్టెంట్స్ విషయంలో ఇప్పటి నుండే చర్చలు మొదలయ్యాయట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సీరియల్ నటుడు ఒకరు కన్ఫర్మ్ అయ్యారని తెలుస్తుంది.

Bigg Boss Season 7 interesting update

Advertisement

ముందుగా అనుకున్న ప్రకారం ఆయన గత సీజన్ లోనే వెళ్లాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల వెళ్లలేదు. కానీ ఈసారి ఆయన వెళ్ళబోతున్నాడు. ఇక యూట్యూబ్ ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న యంగ్ స్టార్ కి కూడా ఛాన్స్ దక్కిందట. అంతే కాకుండా సింగర్స్ కోటాలో ఈసారి ఒక అమ్మాయిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్నారు. వచ్చే ఏడాది లో కాస్త ముందుగానే అంటే జులై లేదా ఆగస్టులోనే కొత్త సీజన్ ను ప్రారంభించేలా ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతుంది. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 చాలా కొత్తగా ఉండబోతుంది అన్నమాట.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి