
Bigg Boss Siri shares interesting post
Bigg Boss Siri : బిగ్ బాస్ కార్యక్రమంతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న వారిలో సిరి, షణ్ముఖ్ తప్పకుండా ఉంటారు. ఈ షో వాళ్లకి కలిసి రావడం పక్కన పెడితే దీని వలన రిలేషన్స్ బ్రేకపన్ అయ్యాయి. బిగ్‌బాస్ 5 సీజన్ తర్వాత సిరి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. విమర్శలు, ట్రోల్స్‌తో ఆమె బాగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ హౌజ్‌లో షణ్ముఖ్‌తో ఈమె చేసిన రచ్చ మాములుగా లేదు. దీంతో ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తాయి. ఈ స్థాయిలో తనకు వ్యతిరేకత రావడం చూసి డిప్రెషన్‌లోకి వెళ్లింది. అలాంటి సమయంలో ఆమె బాయ్‌ఫ్రెండ్, నటుడు శ్రీహాన్ ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు.
అయితే ప్రారంభంలో అతను కూడా సిరిని దూరం పెట్టాడని వార్తలు వినిపించాయి. అంతేకాదు వారిద్దరికి సంబంధించిన వ్యక్తిగత పోస్ట్‌లను కూడా శ్రీహాన్ డిలిట్ చేయడంతో షణ్మఖ్-దీప్తి సునైన బాటలోనే వీరు కూడా బ్రేకప్ చెప్పుకున్నారంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి.సిరి హన్మంత్ యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు, సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. హౌస్ నుంచి బయటకి వచ్చాక షణ్ముఖ్, సిరి ఈ నెగిటివిటీని ఎదుర్కోలేకపోయారు. ఇక హౌస్ నుంచి బయటకి రాగానే దీప్తి సునైనా షన్నుకి బ్రేకప్ చెప్పింది. అయితే వీళ్ళు విడిపోవడానికి కారణం సిరినే అని అంతా అనుకున్నారు. ఇక సిరిని కూడా శ్రీహాన్ వదిలేసారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సిరి చేసిన పోస్ట్‌తో కాస్త పుకార్లకి బ్రేకప్ పడిందనే చెప్పాలి.
Bigg Boss Siri shares interesting post
తాజాగా సిరి ఓ ఫోటో షేర్ చేసి పోస్ట్ చేసింది. దీంతో తన రిలేషన్ పై క్లారిటీ ఇచ్చింది సిరి హన్మంత్. తాజాగా సిరి ఓ పార్టీలో శ్రీహాన్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ”ప్రతి క్షణం నా మంచి, చెడు సమయాల్లో పక్కనే నిలిచే వ్యక్తి. మంచి మనసున్న వ్యక్తి. నా బలం, నా మర్గదర్శి, నా గార్డియన్, నా సర్వస్వం అన్ని ఇతనే. మై వన్ అండ్ ఓన్లీ శ్రీహాన్” అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ని రోజుల నుంచి వీరి రిలేషన్ పై అనేక వార్తలు రాగా తాజాగా ఈ ఒక్క పోస్ట్ తో అన్నిటికి చెక్ పెట్టి క్లారిటీ ఇచ్చింది సిరి. ఇక వీళ్లిద్దరు కలిశారు, దీప్తి- షణ్ముఖ్ కూడా కలవాలని అందరు కోరుకుంటున్నారు.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.