Bigg boss 5 Telugu siri hanumanth and shanmukh jashwanth relationship going viral in social media
shanmukh : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 లో గేమ్ ఇక కేవలం ఒక్క వారామే మిగిలి ఉంది. ఈ వారం సిరి పక్కా ఎలిమినేట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఆమె ఇప్పటిదాకా ఉండటమే ఎక్కువ అని అంటున్నారు. సిరి, షన్ను లా ట్రాక్ జనాలకు విసుగు తెప్పిస్తోంది. ఓసారి మంచి ఫ్రెండ్స్ అంటూ… మరోసారి ప్రెండ్స్ కంటే ఎక్కువే మేము అనేలా చూపిస్తూ హౌస్ లో గందర గోళం సృష్టిస్తున్నారు వీరిద్దరూ. బుధవారం టాస్క్ పూర్తయిన అనంతరం షన్ను తనకు సిరి మీదున్న ప్రేమను బయట పెట్టేశాడు. సిరి… నువ్వు ఎలిమినేట్ అయితే ఎలానే.. అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
నువ్వు వెళ్లిపోతే నన్ను ఇక్కడ పట్టించుకునే వారే లేరు అంటూ వాపోయాడు. నువ్వు లేని హౌస్ లో నేను ఎలా ఉండగలను సిరి అంటూ… నాకు వారం రోజులు ఇక ఏడుపే దిక్కు అని ఏడుపును దిగమింగుకున్నాడు. అంతటితో ఆగక… సిరి నువ్ నాకు బాగా అలవాటు అయ్యావే అని అన్నాడు. ఇదంతా వింటూ వచ్చిన సిరి…. మరి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎలారా? అని అంటుంది. అవును మనం బయటకు వెళ్లాక ఇంత క్లోజ్‌గా ఉండం కదా? అంటూ షన్ను నవ్వేశాడు. అయితే తాను ఎలిమినేట్ కానన్న భరోసా తనకు ఉందని సిరి ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పేసింది.
Bigg boss 5 Telugu siri hanumanth and shanmukh jashwanth relationship going viral in social media
ఒక పెయిర్ గా ఇద్దరి మధ్య లవ్ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అవుతున్నా… అదంతా నాటకమా లేక నిజమా అని జనాలు జుట్టు పీక్కుంటున్నారు. సిరికి బయట ఆల్ రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ… షన్నుకు లవర్ ఉన్నప్పటికీ వీళ్ళు ఇలా చేస్తుండటం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఓట్ల కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ… కాకపోతే గెలుపు కోసం హగ్గులు, కిస్సులతో మరి ఇంతలా రెచ్చి పోతారా అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఇలా వీరిద్దరూ బిగ్ బాస్ అన్ని సీజన్లలో.. మోస్ట్ ఇరిటేటింగ్ కపుల్ గా నిలుస్తున్నారు..
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
This website uses cookies.