Bigg Boss 6 Telugu : స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్ 6 భారీ అంచనాలతో మొదలై రోజు రోజుకీ మరింత రసవత్తరంగా సాగుతుంది. ఇక ఇప్పుడు ఎనిమిదో వారం హౌస్ లో నుంచి ఫైర్ బ్రాండ్ గలాటాలో గీతు ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో ఒకరైన గీతు హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడంతో తను ఏడ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగార్జున సైతం ఆమె ఏడుపును తీసుకోలేక ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చారు. ఇది ఇలా ఉండగా నిన్న జరిగిన బిగ్ బాస్ నామినేషన్ లో పైమా ఇనయా ల మధ్య మాటలు యుద్ధం జరిగిందని చెప్పాలి. ఈ మాటలు కాస్త హద్దులు కూడా దాటాయి. ఇక ఎప్పుడూ కంట్రోల్ గా ఉండే పైమా కూడా ఫస్ట్ టైం హద్దులు మీరి ఇనయా పై షాకింగ్ కామెంట్స్ ను చేసింది.
అయితే ఇనీయాకు సూర్య హెల్మెట్ అయిన తర్వాత నుంచి బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి. ఇక సూర్య ఎలిమినేట్ అయ్యాక హౌస్ లోని వాళ్ళందరూ ఇనయా ను టార్గెట్ చేయడం మొదలెట్టారు. ఇక ఇనయా కూడా వాటిని తిప్పి కొడుతూ టాప్ కాంపిటీషన్ ఇచ్చి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. దీంతో ఇనయా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కాగా ఈ వారం హౌస్ లోని ఎనిమిది మంది సభ్యులు ఇనయా ను నామినేట్ చేశారు. ఫైమా మాత్రం ఇనయాను నామినేట్ చేయలేదు కానీ ఇనయా ఫైమా ను నామినేట్ చేసింది. దీంతో ఒక్కసారిగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఫైమా ను నామినేట్ చేసి ఇనయా చెప్పిన రీజన్ ఫైమా కు నచ్చలేదు. ఇనయా మాట్లాడుతూ…
మొన్న జరిగిన చేపల చెరువు టాస్క్ లో మరీనా మరియు బాల ఆదిత్య , చేపలను కాపాడుకుంటున్న సమయంలో ఒకరి మీద ఒకరు పడుకోండి అంటూ నువ్వు కామెంట్ చేసావ్ అది నాకు అసలు నచ్చలేదంటు చెప్పుకొచ్చింది. దీంతో ఫైమా నీ మైండ్ సెట్ ఇంతేనా నీకు తెలుగు రాదా? నీకు తెలుగు రాకపోతే నేర్చుకో, అంతేకానీ కంటెస్టెంట్ మీద ఇలా లేనిపోనివి చెప్పడం మంచిది కాదంటూ నువ్వు ఫేక్ అంటూ మండిపడింది. దీంతో ఇనయా కూడా నువ్వే ఫేక్ అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఇక ఈ మాటలు యుద్ధంలో మాట మాట పెరిగి ఒక్కసారిగా ఫైమా తూ తూ అని అంటూ ఉమ్మేసింది. అయితే ఫైమా ఇలా అనడం ఏమాత్రం కరెక్ట్ కాదని తన ఫ్యాన్స్ చెప్తున్నారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా బిగ్ బాస్ హౌస్ లో కంట్రోల్ గా ఉంటేనే సీజన్ కప్పు కొట్టగలరని అంటున్నారు. మాటలు జారకుండా మంచిగా ఆడితే ఈ సీజన్ కప్పు కొట్టేది ఫైమానే అని తన ఫ్యాన్స్ చెప్తున్నారు. మరి కొందరు ఎన్నిసార్లు ఉమ్మిన ఇనయా కు సిగ్గు రాదంటూ ట్రూల్ చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.