Home » Entertainment » Bigg Boss Telugu 7 Second Launch Coming Soon
Entertainment

Bigg Boss Telugu 7 : బిగ్ లీక్ చేసిన నాగార్జున .. హౌస్ లోకి కొత్తవాళ్లు..!

Authored By
aruna
The Telugu News | Published on: October 2, 2023, 5:00 pm
Advertisement

Bigg Boss Telugu 7 : ప్రస్తుతం బిగ్ బాస్ 7వ సీజన్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది. ఈ సీజన్ స్టార్ట్ కాకముందే నాగార్జున ఉల్టా ఫల్టా సీజన్ అని చెప్పారు. అయితే మొదట్లో కాస్త ఉల్టా పల్టా ఫీలైన కూడా మళ్లీ ఇప్పుడు షో రొటీన్ గాని అనిపిస్తుంది. ఉల్టా ఫల్టా నీ చూపించే టైము దగ్గరలోనే ఉంది అంటున్నారు. అందుకు చేయవలసిన ఏర్పాట్లు కూడా చేశారట. ఈ సీజన్ కి సంబంధించి ఇప్పటికే చాలా గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇందులో మాత్రం ఒక విషయం అందరిని ఆకట్టుకుంటుంది. నిజంగా అలా జరుగుతుందా లేదా అని చర్చించుకుంటున్నారు. అయితే చివరికి నాగార్జున కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో బిగ్ బాస్ పెద్ద బ్రేక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

ఈ సీజన్లో 14 మందిని హౌస్ లోకి పంపించి ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు. అందులోనూ మూడు బెడ్రూమ్స్ పెట్టి అందరినీ కన్ఫ్యూజ్ చేశారు. అయితే కొందరు ఇందులో పెద్ద ప్లాన్ ఏముందిలే అంటున్నారు. హౌస్ లో ఐదు వారాలకి ఐదుగురు ఎలిమినేట్ అవుతారు. అప్పుడు హౌస్ లో 9 మంది ఉంటారు. షో ముందుకి వెళ్లాలంటే మరో అయిదుగురు కంటెస్టెంట్లు కావాల్సి ఉంటుంది. అందుకే మొదటి నుంచి ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా గ్రాండ్ లాంచ్ 2.0 ఉంటుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అందరూ దానిని లైట్ గా తీసుకున్నారు.

Bigg Boss Telugu 7 second launch coming soon

Advertisement

ఇప్పుడు నాగార్జున నోటి నుంచి హింట్ రావడంతో ఇప్పుడు మళ్ళీ గ్రాండ్ లాంచ్ ఉంటుందని చెబుతున్నారు. అక్టోబర్ 8న ఈ లాంచ్ ఉంటుందని చెబుతున్నారు. అందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్లు కూడా రెడీ అయిపోయారట. అంబటి అర్జున్, అంజలి పవన్, పూజ మూర్తి, గోలి షావలి, నైని పావని సెకండ్ లాంచ్ లో సెకండ్ హౌస్ లోకి రాబోతున్నారు. వీళ్ళ పేర్లు ఉన్నా లేకపోయినా గ్రాండ్ల మాత్రం కచ్చితంగా ఉంటుందట. ఈ సీజన్ లో వచ్చిన రూమర్స్ చాలా వరకు నిజం అయ్యాయి. సోషల్ మీడియాలో ఎవరి పేరు ఎక్కువగా వినిపిస్తుందో వాళ్లని బిగ్ బాస్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఉల్టా ఫల్టా సీజన్ కాబట్టి సెకండ్ లాంచ్ ఉంటుందని జనాలు గట్టిగా ఫిక్స్ అయిపోయారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి