Home » Entertainment » Bigg Boss Telugu 7 Shivaji Elimination Confirm
Entertainment

Bigg Boss Telugu 7 : గంగవ్వ లాగే నేను వెళ్ళిపోతున్నా అంటూ ఏడుస్తూ చెప్పిన శివాజీ ..!

Authored By
aruna
The Telugu News | Published on: October 21, 2023, 8:00 pm
Advertisement

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న శివాజీ చేతికి గాయం అవ్వడంతో మూడు వారాలుగా నొప్పిని భరిస్తూనే బిగ్ బాస్ లోనే కొనసాగుతున్నారు. అయితే గురువారం చేతి గాయం మరింత ముదరడంతో ఆయనను హౌస్ నుంచి బయటికి పంపించారు. స్కానింగ్ అనంతరం అతడిని మళ్ళీ హౌస్ లోకి పంపించారు. కాగా ఆయన చేతికి కట్టుతో వచ్చారు. నొప్పితో బాధపడుతున్నట్లుగా కనిపిస్తున్నారు. శివాజీ చాలా అన్ ఈజీగా ఉంటున్నారు. ఇక బిగ్ బాస్ కూడా ఫిజికల్ టాస్కులు ఇవ్వకుండా అతడికి లగ్జరీ రూమ్ ఇచ్చి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

Advertisement

ఈవారం టాస్క్ లో కూడా కేవలం శివాజీని సంచాలక్ గా పరిమితం చేశారు. అయితే హౌస్ లో శివాజీ ఎక్కువ రోజులు ఉండడం కష్టమే. చేతి నొప్పి ఎక్కువ కావడంతో మళ్ళీ కన్వెన్షన్ రూమ్ కి పిలిచారు బిగ్ బాస్. నొప్పి ఎలా ఉంది అని బిగ్ బాస్ అంటే చాలా ఇబ్బంది పడుతున్నాను బిగ్ బాస్.. చేయి మొత్తం లాగుతుంది అంటూ తన బాధ మొత్తాన్ని చెప్పుకున్నాడు శివాజీ. ఎవరూ లేకుంటే నేను ఏడుస్తున్న ఎవరైనా ఉంటే లోపల ఏడుస్తున్న అందరి ముందు ఏడవలేక పోతున్నాను బరువుగా ఉంది నన్ను హౌస్ లో ఉన్నవాళ్లు ఆడడం లేదు అని అనేసరికి బాధగా ఉంది అని ఏడ్చేశాడు శివాజీ.

Bigg Boss Telugu 7 shivaji elimination confirm

Advertisement

మొత్తానికి శివాజీ ఏడుస్తుంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది. హౌస్ లో కన్నీళ్లు పెట్టుకుంది చాలా తక్కువ. మొన్న నయని వెళ్లినప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మళ్ళీ ఇప్పుడు ఏడ్చారు. శివాజీ గతంలో ఇలానే అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు గంగవ్వను కూడా ఇలానే మూడుసార్లు కన్వెన్షన్ రూమ్ కి పిలిచి అడిగేవారు. అనారోగ్య కారణాలతో ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించారు. అయితే ఇప్పుడు శివాజీని ఇంట్లో ఉంచుతారో లేక అతడి బాధను గమనించి బయటికి పంపిస్తారో అన్నది సస్పెన్షన్గా మారింది. అయితే బిగ్ బాస్ లీక్స్ నుంచి వచ్చేవారం శివాజీని బయటికి పంపిస్తున్నట్లు కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి