
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లో ఆ గొడవలేంది.. రోజు రోజుకి శృతి మించిపోతున్నారుగా..!
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌ని చూస్తుంటే వారు సెలబ్రిటీల మాదిరిగా కనిపించడం లేదు. వీధి రౌడీల మాదిరిగా కనిపిస్తున్నారు. నలుగురు చూస్తున్నారని కూడా మరచిపోయి ఇష్టమోచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు.తాజా ఎపిసోడ్‌లో ప్రేరణ బిగ్ బాస్ హౌస్ చీఫ్ అవ్వడం, నబిల్ పృధ్వీ మధ్య గొడవ, తేజా చేసిన పిచ్చిపని.. విష్ణు ప్రియను ప్రేరణ టార్గెట్ చేయడం వంటివి హాట్ టాపిక్ అయ్యాయి.కంటెస్టెంట్స్‌కు ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ దక్కించుకోవడం కోసం బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. పాము తనదగ్గరున్న ఆకలి తీర్చుకోవడానికి మీ వద్ద ఉన్న గోల్డెన్ ఎగ్స్ అడుగుతుందని బిగ్‌బాస్ అన్నాడు. ఎవరి ఎగ్ అయితే పాము తినేస్తుందో వారికి షీల్డ్ దక్కదని, పాము ఎవరి ఎగ్ అయితే తినదో వారికే ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కుతుందని బిగ్‌బాస్ అన్నాడు.
ఎగ్ విషయంలో టేస్టీ తేజతో నిఖిల్, పృథ్వీ, హరితేజ గొడవపడ్డారు. చివరకు నబీల్ ఎగ్ ఒక్కటే మిగలడంతో అతడికి ఎవిక్షన్ షీల్డ్ దక్కింది. అయితే మెగా చీఫ్ కోసం జరిగిన పోరులో నబిల్ పగపట్టి పృధ్వీని టాస్క్ నుంచి బయటపడేలా చేశాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదిరి కొట్టుకునేంత వరకూ వచ్చింది. కాని చుట్టు ఉన్నవాళ్ళు ఆపడంతో ఇద్దరు అంత ఆవేశంలో ఉన్న కంట్రోల్ అయ్యారు. వారి అరుపులతో బిగ్ బాస్ హౌస్ దద్దరిల్లిపోయింది. నిజంగా తన్నుకుంటారేమో అని ఆడియన్స్ భయపడేలా చేశారు ఇద్దరు. ఎవరిది తప్పు అనేది మాత్రం ఇక వీకెండ్ రానే వచ్చింది.. నాగార్జున క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక మెగా చీఫ్ అయిన వెంటనే రుబాబ్ స్టార్ట్ చేసింది ప్రేరణ. మరీ ముఖ్యంగా తనకు సపోర్ట్ చేయలేదు అన్న కారణంగా విష్ణు ప్రియను టార్గెట్ చేయడం మొదలు పెట్టింది.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లో ఆ గొడవలేంది.. రోజు రోజుకి శృతి మించిపోతున్నారుగా..!
ప్రేరణ మాటల్ని విష్ణుప్రియ పట్టించుకోలేదు. దాంతో ప్రేరణనే స్వయంగా సామాన్లు సర్ధేసింది.ఈసీజన్ లో హరితేజ నుంచి చాలా మంది ఎక్స్ పెక్ట్ చేస్తూ వచ్చారు. సీజన్ 1 లో హరితేజ హరికథ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఆమెకు మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పటికీ బిగ్ బాస్ సీజన్ 1 అంటే.. హరితేజ్ హరికథే ముందుగా చెపుతుంటారు. ఈసారి కూడా హరికథ పార్ట్ 2ను ఓపెన్ చేశారు హరితేజ. అద్భుతంగా చెప్పాలని స్టార్ట్ చేసిన ఆమెకు.. ఈసారి అంతగా కాలం కలిసి రాలేదు. ఏదో చెప్పారు కాని.. అందులో క్లారిటీ లేదు. ఎవరిగురించి చెప్పినా.. అది పెద్దగా పేలలేదు కూడా. దాంతో హరితేజ్ హరికథ పార్ట్ 2 అట్టర్ ప్లాప్ అయిందని, ఆమె ఎక్కువ రోజులు హౌజ్‌లో ఉండకపోవొచ్చని కొందరు జోస్యాలు చెబుతున్నారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.