Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో అప్రతిహతంగా సాగుతుంది. నాగార్జున హోస్ట్‌గా సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న ఈ కార్యక్రమం తెలుగులో ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఎనిమిదో సీజన్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ షో వారం రోజులు పూర్తి చేసుకోవడం, హౌజ్ నుండి బేబక్క ఎలిమినేట్ కావడం జరిగింది.తొలివారం నామినేషన్స్ లో విష్ణుప్రియ, పృథ్వీరాజ్, సోనియా , మణికంఠ, శేఖర్ భాషా, బేబక్క ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. అయితే బేబక్క లేదా మణికంఠ ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరిగింది. నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లలో బేబక్క కి తక్కువ ఓట్లు రావడంతో ఆమెని నాగార్జున ఎలిమినేట్ చేశారు.
ఫస్ట్ వీక్ లో సరిగ్గా పెర్ఫామ్ చేయని కంటెస్టెంట్ అంటే బేబక్క అనే చెప్పొచ్చు. ఆమె తర్వాత మణికంఠ, శేఖర్ భాషా లాంటి వాళ్ళు ఉన్నారు. మణికంఠ ఎమోషనల్ గా హైలైట్ అవుతూ వచ్చాడు. ఏదో విధంగా అతడు ఆడియన్స్ అటెన్షన్ ని పొందాడు. దీనితో ఫస్ట్ వీక్ లో సేఫ్ అయ్యాడు. నామినేషన్స్ లో ఉన్న ఇతర కంటెస్టెంట్స్ లలో విష్ణుప్రియ, సోనియా ఆకుల మంచి ఓటింగ్ తో సేఫ్ అయ్యారు. పృథ్వీ కూడా ఈ వీక్ పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. కానీ సేఫ్ అయ్యాడు. బేబక్క ఎలిమినేట్ కావడంతో ఇక హౌస్ లో 13 మంది సభ్యులు ఉంటారు. సీజన్ 8లో ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ కంటెస్టెంట్ లేరు. లాహిరి లాహిరి లాహిరిలో చిత్ర హీరో అంటూ ఆదిత్య ఓంని హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకువచ్చారు. అతడు ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇలాంటి కంటెస్టెంట్స్ లతో బిగ్ బాస్ 8 ఎలా సక్సెస్ అవుతుంది అనే అనుమానం ముందు నుంచి ఉంది.
బిగ్ బాస్ తెలుగు 8 తొలివారం టీఆర్పీ రేటింగ్స్ దారుణంగా నమోదైనట్లు తెలుస్తోంది.సీజన్ 8 కి కనీసం సీజన్ 6 కి వచ్చిన 8 రేటింగ్ అయినా వస్తుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ట్రెండ్ చూస్తుంటే టీఆర్పీ రేటింగ్ సీజన్ 8కి బాగా పడిపోయినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన నంబర్ త్వరలోనే వెల్లడించనున్నారు. తొలివారమే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రాబోయే రోజుల్లో ఏమవుతుందో అనేది చూడాలి. దీనితో బిగ్ బాస్ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారట. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ అయినా కాస్త గుర్తింపు ఉన్న సెలెబ్రిటీ అయితేనే ప్రయోజనం ఉంటుంది. లేకుంటే అది కూడా వృధానే అవుతుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.