Home » Entertainment » Biggboss 6 Arjun Kalyan Full Focus On Sri Satya Not In Game
Entertainment

BiggBoss 6 Telugu : ఇతడి ఫోకస్ అంతా ఆమె మీదే.. ఇక ఆట ఎక్కడ ఆడతాడు.. తీసుకెళ్లి జైల్లో వేశారు..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: October 1, 2022, 1:00 pm
Advertisement

BiggBoss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో అంతకుముందు ఎవరికీ పెద్దగా పరిచయం లేని వ్యక్తిగా అర్జున్ కళ్యాణ్ హౌస్ (arjun kalyan )లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతను కూడా కొన్ని సీరియల్స్ చేశాడు. ఒక సినిమాలో కూడా నటించాడు. వీళ్లు బిగ్ బాస్ కి వెళ్తున్నారని తెలిసే కొన్ని ఛానెల్స్ ముంద్దుగానే కొన్ని ఇంటర్వ్యూస్ చేశాయి. అయితే హౌస్ లో ఉన్న సింగిల్ మెన్ లలో అర్జున్ కళ్యాణ్ ఒకడు. మంచి కటౌట్ కూడా అతనిది.. ఆటలో కొన్ని పాయింట్స్ కూడా బాగానే మాట్లాడుతున్నాడు అనిపించింది.వీటిననంటినీ వాడుకుని అతని ఆట వారం వారం డెవెలప్ అవుతుంది అనుకుంటే సింగిల్ మ్యాన్ కద ఆడ వాసన తగలగానే కూల్ అయిపోయాడు.

Advertisement

అసలు తను బిగ్ బాస్ కి ఎందుకు వచ్చాను అన్న విషయాన్ని కూడా మర్చిపోయి మరో హౌస్ మెట్ కి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. అర్జున్ కళ్యాణ్ కి శ్రీ సత్య ( sri sathya ) మీద ఇంట్రెస్ట్ ఉంది. అది అందరికి తెలిసిన విషయమే. ఆమెని ఇంప్రెస్ చేయడానికి నానా తిప్పలు పడుతున్నాడు గురుడు.రీసెంట్ గా జరిగిన హోటల్ టాస్క్ లో తన దగ్గర ఉన్న ఎమౌంట్ మొత్తం ఒక్క శ్రీ సత్యకే ఇచ్చి ఆమె చేత పనులు చేయించుకున్నాడు. టాస్క్ ఓడిపోయినా పర్లేదు కానీ శ్రీ సత్యకి దగ్గరవడానికి ఇదే మంచి ఛాన్స్ అనుకున్నాడు. అయితే అతనికి తెలియని మరో విషయం ఏంటంటే ఆటలో తను చాలా వెనకపడి పోయాడు.

bigg boss 6 arjun kalyan full focus on sri satya not in game

Advertisement

తన ఫోకస్ అంతా శ్రీ సత్య మీద ఉంచి బిగ్ బాస్ హౌస్ ( BiggBoss 6 Telugu) లో తన ఆటని మర్చిపోయాడు అర్జున్ కళ్యాణ్. అందుకే హోటల్ టాస్క్ లో వరస్ట్ పర్ఫార్మర్ ఎవరు అని హౌస్ మెట్స్ ఓట్స్ వేయగా.. దానిలో మెజారిటీ ఓట్స్ అర్జున్ కళ్యాణ్ కే వచ్చాయి.ఫైనల్ గా అతన్ని తీసుకెళ్లి బిగ్ బాస్ జైల్లో వేశారు. అసలే నామినేషన్స్ లో ఉన్నాడు కదా.. వరస్ట్ పర్ఫార్మర్ అని కూడా వచ్చింది కాబట్టి ఈ వారం తనే వెళ్తాడని అనుకున్నాడో ఏమో బిగ్ బాస్ కెమెరా వైపు చూసి ఆడియన్స్ ప్లీజ్ ఈ ఒక్క వారం సేవ్ చేయండి. నెక్స్ట్ వీక్ నుంచి నేనేంటో చూపిస్తా అని చెప్పాడు అర్జున్ కళ్యాణ్. మరి వచ్చే వారమైనా అతని పూర్తిస్థాయి ఆట కనబరిస్తే బెటర్ లేదంటే తట్టా బుట్టా సర్ధేసుకోవాల్సిందే మరి.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి