Home » Entertainment » Bindu Madhavi Dated With Trisha Ex Boyfriend Varun
Entertainment

Bindu Madhavi – Trisha : త్రిష మాజీ బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేశా.. బిందు మాధవి షాకింగ్ కామెంట్స్ వైరల్

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: May 7, 2023, 2:15 pm
Advertisement

Bindu Madhavi – Trisha : బిందు మాధవి. అచ్చ తెలుగు అమ్మాయి. కానీ.. తెలుగు ఇండస్ట్రీలో ఎందుకో హీరోయిన్ గా రాణించలేకపోయింది. మధ్యలో కొన్నేళ్ల పాటు గ్యాప్ తీసుకున్నా బిగ్ బాస్ తో తనకు మంచి క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ విన్నర్ అయిన బిందు.. ఇప్పుడు ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. టాలీవుడ్ లో మంచి క్యారెక్టర్స్ కూడా తనకు వస్తున్నాయి. వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. ప్రస్తుతం తన చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి.

Advertisement

తమిళం ఇండస్ట్రీలోనూ తనకు మంచి గుర్తింపు ఉంది. అక్కడ చాలా సినిమాల్లో నటించి ఒక మోస్తారు హీరోయిన్ అనిపించుకుంది. కానీ.. ఎప్పుడైతే బిగ్ బాస్ లో విన్నర్ అయిందో అప్పటి నుంచి తన రేంజే మారిపోయింది. ఇటీవల ఆహా కోసం న్యూసెన్స్ అనే ఒక వెబ్ సిరీస్ లో నటించింది బిందు. అది మే 12న విడుదల కానుంది. దాని ప్రమోషన్స్ కోసం బిందు మాధవి బిజీబిజీగా ఉంది. దానిలో భాగంగానే నిర్వహించిన ప్రెస్ మీట్ లో బిందు మాధవి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.

bindu madhavi dated with trisha ex boyfriend varun

Advertisement

Bindu Madhavi – Trisha : త్రిష బాయ్ ఫ్రెండ్ తో మీరు డేటింగ్ చేశారా?

త్రిష బాయ్ ఫ్రెండ్ తో మీరు డేటింగ్ చేశారా.. అంటూ బిందు మాధవికి ఒక ప్రశ్న ఎదురైంది. దీంతో ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పేసింది బిందు మాధవి. అవి రూమర్స్ ఏం కాదు. త్రిష మాజీ బాయ్ ఫ్రెండ్ వరుణ్ తో నేను నిజంగానే డేటింగ్ లో ఉన్నా అంటూ బిందు మాధవి అంగీకరించింది. కాకపోతే అది జరిగిన సందర్భం వేరు. ఒకే సమయంలో మేము డేటింగ్ లో లేము. త్రిషతో బ్రేకప్ చెప్పిన తర్వాతనే వరుణ్ నాతో డేట్ చేశాడు. నిజం ఎప్పుడైనా నిజమే కదా. దాన్ని ఒప్పుకోవాల్సిందే అంటూ బిందు మాధవి సమాధానం చెప్పుకొచ్చింది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి