
Bobby : చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి తేడా ఇదే అని చెప్పిన బాబీ..!
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ పని చేయగా, ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి డైరెక్షన్ చేసే అవకాశం దొరికింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ఎన్టీఆర్ హీరోగా జై లవకుశ అనే సినిమాతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత బాబీకి వరుస విజయాలు దక్కాయి. బాబీ చేసిన ఫిలిమ్స్ లు బెస్ట్ ఫిలిం అంటే వాల్తేరు వీరయ్య అని చెప్పాలి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాకి చాలామంది రివ్యూవర్స్ చాలా తక్కువ రేటింగ్ ఇచ్చినా కూడా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత చేసిన సినిమాలన్నిటిలో కూడా ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మెగాస్టార్ నుంచి అభిమానులకి ఏం కోరుకుంటారు అవి ప్రజెంట్ చేశాడు బాబి. ఇక నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘డాకూ మహారాజ్’ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతి కానుకగా విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల టీజర్ విడుదల అయ్యి సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది.
Bobby : చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి తేడా ఇదే అని చెప్పిన బాబీ..!
బాలకృష్ణ ను Balakrishna ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించే ప్రయత్నం బాబీ చేస్తున్నాడని టీజర్ చూస్తేనే క్లారిటీ వచ్చింది. ఈ సినిమా ఆరంభం అయినప్పటి నుంచి పెద్దగా అప్‌డేట్స్ ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. బాబీపై ఒకానొక సమయంలో ఫ్యాన్స్ విమర్శలు చేశారు. తాజాగా బాబీ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను బాలయ్య ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ చిరంజీవి గారు కథలో కేవలం వేలు మాత్రమే కాకుండా బాడీ మొత్తం పెట్టేస్తారు. కథ ఏంటి.? సీన్ ఏంటి.? డైలాగ్స్ ఏంటి అని అంతగా సినిమాల్లో ఇన్వాల్వ్ అవుతారు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ బాలకృష్ణ విషయానికి వస్తే డైరెక్టర్ ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్లిపోతాడు. ఒక క్వశ్చన్ కూడా చేయడు. అది దర్శకుడికి ఇంకా ఎక్కువ బర్డెన్ పెంచుతుంది. ఇంకా కేర్ఫుల్ గా పనిచేసేలా చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు బాబి.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.