Home » Entertainment » Bollywood Star Act In Prabhas Movie
Entertainment

Prabhas : ప్రభాస్ తండ్రిగా ఆ టాప్ హీరో ..థియేటర్ లు షేక్ అవ్వడం గ్యారెంటీ !

Authored By
aruna
The Telugu News | Published on: June 22, 2023, 8:40 pm
Advertisement

Prabhas : ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఇటీవలే ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో వచ్చిన ప్రభాస్ కొంచెం హిట్ కొంచెం ప్లాఫ్ టాక్ ను సంపాదించుకున్నాడు. కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ఇకపోతే ప్రభాస్ సలార్ , ప్రాజెక్ట్ కె సినిమాలు చేస్తున్నాడు. దీంతోపాటు మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘ రాజాడీలక్స్ ‘ సినిమా కూడా చేస్తున్నాడు. ప్రభాస్ కి ఈ సినిమా సెట్ కాదు కానీ డైరెక్టర్ మీద నమ్మకంతో ప్రభాస్ సినిమాకు ఓకే చెప్పాడని తెలుస్తుంది.

Advertisement

ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి తాతగా బాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నాడని తెలుస్తుంది. ఆయన మరెవరు కాదు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్. ఈ సినిమాలో ప్రభాస్ కు తాతగా నటించనున్నారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ కాంబినేషన్ పై అభిమానులు కాస్త ఫైర్ అవుతున్నారు. ప్రభాస్ కు తాతయ్యగా సంజయ్ ఏంటి. ఈ కాంబినేషన్ ఏ మాత్రం బాగోలేదని ఇద్దరు చూడడానికి తండ్రి కొడుకుల ఉంటారని కామెంట్స్ చేస్తున్నారు.

Bollywood star act in prabhas movie

Advertisement

అంతేకాదు మారుతీతో ప్రభాస్ సినిమా అంటే అభిమానులు కొంచెం కంగారుపడుతున్నారు. ఇప్పటికే వరుస డిజాస్టర్లు ఎదుర్కొంటున్న ప్రభాస్ కి ఏ డైరెక్టర్ హిట్ ఇస్తాడో అర్థం కావడం లేదు. ప్రభాస్ చేసేవన్ని పాన్ ఇండియా సినిమాలే వీటిలో ఏది పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటుందో చూడాలి. ఇక మారుతీతో ప్రభాస్ సినిమా అని ప్రకటించినప్పటినుంచి దీనిపై వివిధ రకాలుగా ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ సినిమా ట్రోలింగ్ జరుగుతుంది. ఈ సినిమాతో అయిన ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ప్రభాస్ అభిమానులు కోరుతున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి