Home » Entertainment » Bollywood Star Hero To Do Villian Role In Balakrishna Movie
Entertainment

Balakrishna : బాలయ్య సినిమాలో నటించడం కోసం ఎవరు రంగంలోకి దిగారో చూడండి !

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: April 24, 2023, 11:30 am
Advertisement

Balakrishna : టాలీవుడ్ లెజెండ్ బాలకృష్ణ స్టార్ హీరో. గత కొన్ని దశాబ్దాల నుంచి ఆయన టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఇండస్ట్రీలో బాలకృష్ణకు వీరాభిమానులు ఉన్నారు. నిజానికి బాలకృష్ణ సినిమాలకు వేరే రాష్ట్రాల్లో కూడా క్రేజ్ ఉంది. బాలకృష్ణ సినిమాలే కాదు.. టాలీవుడ్ సినిమాలకు ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువ పాపులారిటీ పెరగడంతో బాలీవుడ్ ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తోంది. అందుకే.. బాలీవుడ్ లో హీరోలుగా నటించే వాళ్లు..

Advertisement

bollywood star hero to do villian role in balakrishna movie

చివరకు టాలీవుడ్ లో స్టార్ విలన్స్ గా నటిస్తున్నారు. అలాంటి చాలా సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. రామ్ చరణ్ సినిమాలోనూ ఓ బాలీవుడ్ స్టార్ హీరో మెయిల్ లీడ్ లో నటించబోతున్నాడు. అలాగే.. బాలకృష్ణ కొత్త సినిమాలోనూ బాలీవుడ్ హీరో విలన్ గా నటించబోతున్నారట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

Advertisement

BalaKrishna fun with young heroes

Balakrishna : బాలకృష్ణ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో

ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. ఇది బాలకృష్ణ 108వ సినిమా. ఈ సినిమాలో విలన్ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ రాంపాల్ ను తీసుకోనున్నారట. నిజానికి.. అర్జున్ రాంపాల్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. బాలకృష్ణ సినిమాలో పవర్ ఫుల్ విలన్ రోల్ గా అర్జున్ అయితేనే సెట్ అవుతాడని డైరెక్టర్ భావించి.. అతడినే తీసుకోనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించబోతోంది. యంగ్ హీరోయిన్ శ్రీలీల.. బాలయ్యకు కూతురుగా నటిస్తోంది. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి