Devi sri prasad : దేవీ శ్రీ ప్రసాద్.. రాక్ స్టార్‌గా ఇటు తెలుగు అటు తమిళ సినిమాలలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే బ్లైండ్‌గా మ్యూజికల్‌గా సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోవాల్సిందే. యంగ్ హీరోల దగ్గర్నుంచి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కోలీవుడ్‌లో సూర్య లాంటి స్టార్స్ నటించిన ఎన్నో బ్లాక్ బస్టర్స్‌కి దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించడంలో దేవీ శ్రీ ప్రసాద్ స్టైల్ మరెవరికీ లేదు. ఇటీవల టాలీవుడ్‌లో ఉప్పెన సినిమాకి సంగీతం అందించిన దేవీ శ్రీ ప్రసాద్ మెగాస్టార్ సహా పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
bollywood-stars-are-crazy-about-devisri-prasad
కాగా ఇటీవల బాలీవుడ్‌లో కూడా దేవీ శ్రీ ప్రసాద్ తన సత్తా చాటాడు. బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమాలో సీటీమార్ సాంగ్‌కి సంగీతం అందించిన దేవీ శ్రీ ప్రసాద్ అక్కడ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో నటించిన సల్మాన్ అయితే దేవీ శ్రీ ప్రసాద్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఇదే సాంగ్ తెలుగులో అల్లు అర్జున్ – పూజా హెగ్డే చేశారు. అదే సాంగ్ బాలీవుడ్ లో కూడా దేవీ శ్రీ ప్రసాద్ రీమేక్ చేసి సక్సస్ అయ్యాడు. బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఈ సీటీమార్ వీడియో సాంగ్ ఈరోజు విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నుంచి దేవీ శ్రీ ప్రసాద్ కి స్టార్ హీరోలు నటించే సినిమాలకి సంగీతం అందించే అవకాశాలు వస్తున్నాయట. ఇంతకాలం టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తన సత్తా చాటిన దేవీ శ్రీ ప్రసాద్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తనేంటో చూపించబోతున్నాడు. ఇక దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రాధే సినిమాకి ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మే 13న ఒకేసారి థియేటర్స్‌లో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.