Home » Entertainment » Brahmamudi 06 October 2023 Friday Full Episode
Entertainment

Brahmamudi 6 Oct Today Episode : చీటీ చదివి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బయటికి వెళ్లిపోయిన కావ్య.. రాజ్ ని వదిలి ఉండలేక కావ్య ఆత్మహత్య చేసుకుంటుందా?

Authored By
Varun G
The Telugu News | Published on: October 6, 2023, 9:00 am
Advertisement

Brahmamudi 6 Oct Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు అక్టోబర్ 6, 2023 శుక్రవారం ఎపిసోడ్ 220 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంటి డాక్యుమెంట్స్ ను రాజ్.. మూర్తికి ఇస్తాడు. దీంతో మూర్తి, కనకం భావోద్వేగానికి గురవుతారు. మీరు బాగుండాలయ్యా.. పది కాలాల పాటు సంతోషంగా ఉండాలని కనకం సంతోషం వ్యక్తం చేస్తుంది. దీంతో కళ్యాణ్ వచ్చి ఆంటి.. ఇది ఎమోషనల్ కావడానికి సమయం కాదు. ఈరోజు వినాయకచవితి.. అందరం ఎంజాయ్ చేయాలి అంటాడు. ఈరోజు డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ ఉంది అంటాడు. స్టేజ్ మీదికి వెళ్లి దుగ్గిరాల కళ్యాణ్ డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ చేస్తున్నా అని చెబుతాడు. కళ్యాణ్ విత్ అప్పు అంటాడు. దీంతో అనామికకు కోపం వస్తుంది. అప్పు వెళ్తుండగా.. ఆపి నేను వెళ్తాను.. నేను చేస్తాను అంటుంది అనామిక. దీంతో సరే అని అప్పు వెళ్లి కింద కూర్చుంటుంది. ఇక.. అనామిక, కళ్యాణ్ ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేస్తారు.

Advertisement

ఇద్దరూ కలిసి చాలా సేపు డ్యాన్స్ వేస్తారు. అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ల డ్యాన్స్ కి ఈలలు వేస్తారు అందరు.  వాళ్ల డ్యాన్స్ కు అందరూ చప్పట్లు కొడతారు. ఆ తర్వాత డ్యాన్స్ చేసే వళ్లు ఎవరంటే.. రుద్రాణి అత్తయ్య అంటాడు కళ్యాణ్. దీంతో రుద్రాణి షాక్ అవుతుంది. నాకు డ్యాన్స్ రాదు అంటుంది. లేదు.. లేదు వెయ్యాల్సిందే డ్యాన్స్ అంటారు. దీంతో వెళ్లి డ్యాన్స్ వేస్తుంది రుద్రాణి. కొంత సేపు వేసి ఇక చాలు చాలు అంటుంది. థాంక్యూ అంటుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి, ఆమె భర్త ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేయాలని అంటాడు కళ్యాణ్. దీంతో ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేస్తారు. అదరగొట్టేస్తారు. ఆ తర్వాత మూర్తి, కనకాన్ని డ్యాన్స్ చేయాలని చెబుతారు. దీంతో వాళ్లు అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం అనే పాటకు డ్యాన్స్ వేస్తారు. అందరూ చప్పట్లు కొడతారు.

#image_title

Advertisement

Brahmamudi 6 Oct Today Episode : సామీ సామీ పాటకు డ్యాన్స్ వేసిన సీతారామయ్య, ఇంద్రాదేవి

ఆ తర్వాత మన వంశోద్ధారకులు తాతయ్య, నానమ్మ డ్యాన్స్ వేయాలి అని చెబుతాడు కళ్యాణ్. దీంతో సామీ సామీ పాటకు డ్యాన్స్ వేస్తారు ఇద్దరూ. అందరూ మెచ్చుకుంటారు. ఆ తర్వాత రాజ్, కావ్య.. ఇద్దరూ డ్యాన్స్ వేయాలని చెబుతాడు కళ్యాణ్. దీంతో కావ్య షాక్ అవుతుంది. ఇద్దరూ స్టేజీ మీదికి వెళ్తారు. ఇద్దరూ ఒకరి కళ్లలోకి మరకొరు చూస్తూ ఒక్కసారి చెప్పలేవా.. నువ్వు నచ్చావని.. చెంత చేరి.. పంచుకోవా.. ఆశ నీ శ్వాస అని.. మన గుండె గుప్పెడంత.. తన ఊహ ఉప్పెనంత.. బతిమాలుతున్న వేళ.. అంటూ ఆ పాటకు డ్యాన్స్ వేస్తారు.

ఇద్దరూ కళ్లలోకి కళ్లు పెట్టుకొని చూస్తూ డ్యాన్స్ వేస్తారు. తనకు కావ్య ముద్దు ఇస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అందరూ చప్పట్లు కొడతారు. ఆ తర్వాత కావ్య సిగ్గు పడుతూ కిందికి వస్తుంది. ఆ తర్వాత రాజ్, రాహుల్, కళ్యాణ్ ఈ ముగ్గురూ కలిసి డ్యాన్స్ వేస్తారు. వాళ్ల ముగ్గురు భార్యలు కూడా వచ్చి డ్యాన్స్ వేస్తారు. మొత్తానికి అందరూ కలిసి డ్యాన్స్ ఇరగదీస్తారు. తనకు కడుపు లేదు.. యాక్షన్ చేస్తున్నా అనే విషయం కూడా మరిచిపోయి డ్యాన్స్ చేస్తుంది స్వప్న.

Advertisement

తన ప్యాడ్ కింద పడిపోతుంది. దీంతో తనను రూమ్ లోకి లాక్కెళ్లి ప్యాడ్ ఇచ్చి ఇది పెట్టుకో అంటుంది కావ్య. ఇది నేను కాకుండా ఈ ఇంట్లో ఎవరైనా చూసి ఉంటే ఏం జరిగి ఉండేదో అర్థం అవుతుందా? ఇంకా ఎంత కాలం నటిస్తూ వస్తావు. ఎందుకు నా మాట వినడం లేదు. మొన్ననే నీకు చెప్పాను. ఇలాంటి పరిస్థితి నీకు వస్తుంది అని నా మాట నువ్వు లెక్కచేయలేదు. కనీసం ఇప్పుడు నువ్వు ఎంత ప్రమాదకరమైన ఆట ఆడుతున్నావో తెలుసుకో అంటుంది కావ్య.

నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అంటుంది స్వప్న. అంటే.. నీ మోసంలో భాగం అవ్వమంటావా అంటే.. నీకు ఈ విషయం పెళ్లి రోజే తెలిసినా కూడా నువ్వు ఏం చేయలేకపోయావు కదా. ఈ విషయం బయటపడితే నువ్వు కూడా మోసం చేసిన దానివే అవుతావు అంటుంది స్వప్న. దీంతో అవునా.. సరే అయితే అందరికీ ఇప్పుడే నిజం చెప్పేస్తాను అంటుంది కావ్య.

వద్దు వద్దు అంటుంది స్వప్న. ఎంతకాలం ఇలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తావు. నిజంలో ఎప్పుడు బతుకుతావు. పెళ్లికి ముందు డబ్బులు ఉన్న దానిలా నటిస్తూ జనాలను మోసం చేశావు. పెళ్లి నుంచి వెళ్లిపోయి కన్నవాళ్లను మోసం చేశావు. ఇప్పుడు కట్టుకున్న వాళ్లను, అత్తారింటిని కూడా మోసం చేశావు. త్వరలో ఈ ఇంటికి మరో కోడలు రాబోతోంది. ఇలా మోసం చేస్తే ఎలా? తనకు తెలిస్తే ఎలా అంటుంది కావ్య. నాకు కొంత సమయం ఇవ్వు. త్వరలోనే ఈ సమస్యకు ఏదైనా ఒక పరిష్కారం ఆలోచిస్తా అంటుంది స్వప్న.

కావ్య పోయిన తర్వాత ఈ కడుపు ఉందని తెలియడం వల్లనే ఈ సమస్య. అసలు కడుపు పోతే అని అనుకుంటుంది. మళ్లీ నేను ప్రెష్ గా లైఫ్ మొదలు పెట్టొచ్చు. ఇదే మంచి ఐడియా. నేను ఏదో ఒకటి చేసి అబార్షన్ అయినట్టు ఇంట్లో వాళ్లను నమ్మిస్తా అని అనుకుంటుంది స్వప్న.

Advertisement

మరోవైపు అందరూ భోజనాలు చేస్తుంటారు. నాకు కూడా ఆకు వేయండి.. ఇక్కడ కూర్చొంటా అంటే కడుపుతో ఉన్నావు కదా.. కింద కూర్చోకు. పైన కూర్చొని తిను అంటుంది అపర్ణ. మరోవైపు అందరూ భోజనాలు చేశాక రాజ్ రాసిన చీటీని చదువుతుంది కావ్య. తనకు ఏం చేయాలో అర్థం కాదు. ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బయటికి వెళ్లిపోతుంది. ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది కావ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి