
#image_title
Brahmamudi 23 Sep Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 23 సెప్టెంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 209 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓవైపు కావ్య, కనకం, రాజ్ అందరూ ఇంటి దగ్గర డ్యాన్సులు చేస్తుంటారు. మరోవైపు విగ్రహాల దగ్గర కాపలా ఉంటాడు మూర్తి. అయితే.. రాహుల్ చెప్పిన మనుషులు అప్పటికే విగ్రహాల దగ్గరికి వచ్చేస్తారు. వాటిని దొంగలించడం కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు. మూర్తి దగ్గరికి వెళ్తారు. అందరూ మూర్తిని రౌండప్ చేస్తారు. ఎవరు బాబు మీరు.. మీకు ఏం కావాలి అంటే.. విగ్రహాలు కావాలి అంటారు. మీ విగ్రహాలన్నీ ఎత్తుకెళ్తాం అంటారు. ఇవి మా విగ్రహాలు బాబు. వేరే వాళ్లకు అమ్మేశాం. తీసుకెళ్లడానికి మీరెవరు అంటాడు మూర్తి. వీటి మీద చేయి పడితే బాగుండదు అంటాడు మూర్తి. కానీ.. వాళ్లు వినరు. మూర్తిని కొట్టి అక్కడ పడేస్తారు. విగ్రహాలను తీసుకెళ్తూ ఉంటారు. మూర్తి ఎంత మొత్తుకున్నా వినరు.
#image_title
మరోవైపు కనకం, కావ్య, రాజ్, అప్పు చాలా సంతోషంగా ఉంటారు. డ్యాన్సులు చేస్తుంటారు. మూర్తి ఎంత చెప్పినా వినరు. మరోవైపు షాపులో పని చేసే పిల్లాడు ఇదంతా చూసి వెంటనే కావ్య అక్కకు ఈ విషయం చెప్పలి అని అక్కడి నుంచి వెళ్తాడు. మరోవైపు మూర్తి విగ్రహాలు దొంగలించకుండా అడ్డుకుంటూ ఉంటాడు. దీంతో కర్రతో తల మీద తీవ్రంగా కొడతారు. దీంతో మూర్తి అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. మరోవైపు బంటి ఇంటికి వెళ్లి విగ్రహాలను అన్నీ తీసుకెళ్లారని కావ్యకు చెబుతాడు. దీంతో అందరూ త్వరగా అక్కడికి బయలుదేరుతారు. ఇంతలో తెల్లవారుతుంది. కారులో అందరూ అక్కడికి వెళ్తారు. రక్తపు మడుగులో మూర్తి పడి ఉంటాడు. వెళ్లి ఆయన్ను లేపుతారు. చూస్తే మూర్తి వెక్కి వెక్కి ఏడుస్తాడు. అయిపోయింది.. మనం కష్టపడి చేసిన విగ్రహాలన్నీ ఎత్తుకెళ్లారు అంటాడు మూర్తి. అసలు ఏం జరిగింది అంటే.. నాకు తెలియదు.. ఎవరో వచ్చి కొట్టి తీసుకెళ్లిపోయారు అంటాడు మూర్తి.
మా కష్టాలు తీరుతాయి అని అనుకున్నాం కానీ.. చివరకు మా ప్రయత్నాలు అన్నీ వృథా అయ్యాయి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తాడు మూర్తి. ఇంతలో కస్టమర్ వచ్చి విగ్రహాలన్నీ ఏవీ అంటాడు. దీంతో లేవు.. ఎత్తుకెళ్లారు అంటాడు. దీంతో కస్టమర్ తెగ టెన్షన్ పడతాడు. నాకు ఆ విగ్రహాలన్నీ ఖచ్చితంగా కావాల్సిందే. కావ్య.. ఎలాగైనా విగ్రహాలను ఎలాగైనా తీసుకురా అంటాడు శ్రీను. నీ కాళ్లు పట్టుకుంటాను అంటాడు శ్రీను. దీంతో మీరు కంగారు పడకండి. ఏదో ఒకటి ఆలోచిద్దాం అంటుంది కావ్య.
మీకు కావాల్సింది డబ్బే కదా. విగ్రహాలు ఎత్తుకెళ్లారు అని చెబుతున్నారు కదా.. డబ్బు నేను ఇస్తాను అంటాడు రాజ్. దీంతో డబ్బు ఎవరికి కావాలి సార్.. విగ్రహాలు కావాలి అంటాడు శీను. రెండు వ్యాన్లలో విగ్రహాలను తీసుకెళ్లారు అని చెబుతాడు మూర్తి. దీంతో కారులో ఇందాక వస్తుండగా వ్యానును చూస్తాడు రాజ్. అది గుర్తుకు తెచ్చుకొని దొరికింది అంటాడు. వచ్చే దారిలో మనకు రెండు డీసీఎంలు ఎదురు వచ్చాయి అంటాడు రాజ్. వాటిల్లోనే వాళ్లు విగ్రహాలు తీసుకెళ్లారు అంటాడు. వ్యాన్ నెంబర్ కూడా గుర్తుకు తెచ్చుకుంటాడు రాజ్. ఆ విగ్రహాలను తప్పకుండా పట్టుకుంటా.. నువ్వేం కంగారు పడకు. నువ్వు ఇక్కడే ఉండు అని కావ్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు రాజ్.
మరోవైపు ఆ విగ్రహాలను అన్నింటినీ తీసుకెళ్లి ఏదైనా చెరువులో వేసేయాలని రాహుల్ వాళ్లకు చెబుతాడు. దీంతో చెరువు దగ్గరకు వాటిని తీసుకెళ్తారు. మరోవైపు రాజ్ ఒకవైపు, అప్పు కూడా తన ఫ్రెండ్స్ తో మరోవైపు విగ్రహాల కోసం వెతుకుతూ ఉంటుంది. మధ్యాహ్నం గడుస్తున్నా ఎవ్వరూ రాకపోవడంతో ఇక నాకు నమ్మకం లేదు.. విగ్రహాలు దొరకవు అంటాడు శీను. వాళ్లు ఈ పాటికి విగ్రహాలను అమ్మేసి ఉంటారు అంటాడు శీను. కానీ.. వాళ్లు చెరువు దగ్గర విగ్రహాలను ఆపి వాటిని నీళ్లలో నిమజ్జనం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.