
#image_title
Brahmamudi 25 Sep Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 25 సెప్టెంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 209 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మీరు చేసిన సాయానికి నేను మీకు ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను అని రాజ్ తో అంటుంది కావ్య. రాజ్ కు ధన్యవాదాలు తెలుపుతుంది. ధన్యవాదాలు కూడా చిన్న పదమే అవుతుందని.. ఇది జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని రాజ్ కి చెప్పి చాలా సంతోషంగా ఉంటుంది కావ్య. అయితే.. మీరు మాకు తెలియకుండానే డిజైన్స్ వేసి ఇచ్చారు కదా రాజ్.. కావ్యతో అంటాడు. ఆ సహాయానికి బదులుగా నేను ఈ సాయం చేశాను అంటాడు రాజ్. అది సాయం అనుకునే వాళ్లను ఎదురించి పోరాడారా అని ప్రశ్నిస్తుంది కావ్య.
#image_title
దీంతో అది నీకు పెద్ద విషయం కావచ్చు కానీ.. నాలాంటి తెలివైన బలమైన ధైర్యవంతులకు అది చాలా మామూలు విషయం అని అంటాడు రాజ్. దీంతో కావ్య ఏం మాట్లాడదు. మరోవైపు అప్పుడే అక్కడి నుంచి ఒక బొద్దింక వెళ్తూ ఉంటుంది. దాన్ని చూసి అరుస్తాడు రాజ్. దాన్ని చూసి భయపడతాడు రాజ్. వెంటనే మంచం ఎక్కుతాడు. ఏయ్ అంటూ గట్టిగా అరుస్తాడు. దీంతో ఏం చేయాలో కావ్యకు అర్థం కాదు. అసలు రాజ్ ఎందుకు అరుస్తున్నాడో కూడా తనకు అర్థం కాదు. ఉన్నపళంగా ఒక్కసారిగా ఇలా అరవడం ఏంటి అని అనుకుంటుంది కావ్య. ఏమైందండి.. ఎందుకు అలా అరుస్తున్నారు అని అడుగుతుంది కావ్య. దీంతో క..క..క..క.. కాక్రోచ్ అంటూ భయంగా చెబుతాడు రాజ్. కాక్రోచ్ ను చూసి ఇంతలా భయపడుతున్నాడా అని కావ్య షాక్ అవుతుంది. కావ్య బిక్కమొహం వేసుకొని చూస్తుంది.
ఇక.. తన విగ్రహాలు దొరకడంతో, కాంట్రాక్ట్ పూర్తయి డబ్బులు కూడా చేతికి రావడంతో మూర్తి, కనకం చాలా సంతోషిస్తారు. కావ్య కూడా చాలా సంతోషిస్తుంది. కేవలం కావ్య, రాజ్ వల్లనే పోయాయనుకున్న విగ్రహాలు మళ్లీ దొరికాయని మూర్తి చాలా సంతోషం వ్యక్తం చేస్తాడు. జీవితమే అయిపోయింది అని అనుకున్న మూర్తికి మళ్లీ జీవితం మీద ఆశలు చిగురిస్తాయి.
హమ్మయ్య అనుకొని మూర్తి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. కనకం కూడా చాలా సంతోషిస్తుంది. ఇక.. విగ్రహాలు మళ్లీ దొరికాయని.. కావ్య కాంట్రాక్ట్ విజయవంతంగా పూర్తయిందని, ఇక కావ్య కష్టాలు, వాళ్ల పుట్టింటి కష్టాలు తీరాయని తెలుసుకున్న రుద్రాణికి అసలు ఏం చేయాలో అర్థం కాదు.
అసలు ఈ ప్లాన్ ఎలా ఫెయిల్ అయింది అని రాహుల్ కు ఫోన్ చేసి అడుగుతుంది. దీంతో రాహుల్ కూడా ఉన్న విషయం చెబుతాడు. పక్కాగా ప్లాన్ చేసి ఆ విగ్రహాలను చివరకు చెరువులో కూడా నిమజ్జనం చేయమని చెప్పానని అంటాడు. కానీ.. చివరి నిమిషంలో ఏం జరిగిందో అర్థం కావడం లేదు అంటాడు రాహుల్.
అసలు విగ్రహాలు వీళ్లకు ఎలా దొరికాయి. ఎంతో కష్టపడి వేసిన ప్లాన్ మొత్తం బెడిసికొట్టిందని రుద్రాణి చాలా కోపంతో ఉంటుంది. కావ్యకు వ్యతిరేకంగా ఏం చేద్దామన్నా అది కావ్యకు అనుకూలంగా మారుతోందని తనకు తీవ్రమైన కోపం వస్తుంది. ఇక.. వాళ్ల కష్టాలు అన్నీ తీరితే కావ్య ఇక మామూలుగా ఉండదు. రచ్చ రచ్చ చేస్తుంది. కావ్య సంతోషానికి బ్రేక్ వేయాలని మరో ప్లాన్ ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాణి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.