
#image_title
Brahmamudi 4 Oct Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి 4 అక్టోబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 218 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కావ్య తల్లిదండ్రులు.. దుగ్గిరాల ఇంటికి వెళ్తారు. బాగున్నారా వదిన అని కనకం.. అపర్ణను అడుగుతుంది. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దానికి మీరే కారణం బాబు అని అంటాడు మూర్తి. దీంతో అదేంటి అంకుల్ మీరు అలా మాట్లాడుతారు. కావ్య అమ్మానాన్నలు అంటే నాకు కూడా అమ్మానాన్నలే కదా. మీకు కష్టం అంటే నేను చూస్తూ కూర్చోను కదా అంటాడు రాజ్. దీంతో సీతారామయ్యతో రాజ్ గొప్పదనం గురించి చెబుతాడు మూర్తి. ఇంతలో అనామిక, ఆమె తల్లిదండ్రులు వస్తారు. మీతో మాట్లాడటానికి వచ్చారు తాతయ్య అని చెబుతుంది కావ్య. అవునా.. రండి మాట్లాడుదాం అంటాడు సీతారామయ్య. ఇద్దరూ మాట్లాడకుండా ఉంటే ఎవరు మాట్లాడుతారు అంటే ఇద్దరూ వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ చూస్తుంటారు. దీంతో మాకు మొత్తం విషయం అర్థం అయింది అంటుంది కావ్య. మా తమ్ముడు అర్థం కాని కవితలు రాస్తాడని అనుకున్నాం కానీ.. ఇలా మాకు సర్ ప్రైజ్ ఇస్తాడని అనుకోలేదు అంటాడు రాజ్. దీంతో అంటే అన్నయ్య.. అంట నాన్చుతూ ఉంటాడు కళ్యాణ్. వాళ్లేం చెబుతారు.. నేను చెబుతాను అంటాడు అనామిక నాన్న.
మా అమ్మాయి.. మీ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్ద వాళ్లు మీరు నిర్ణయం తీసుకుంటే మనం వాళ్ల పెళ్లి చేద్దాం అంటాడు. దీంతో మా ఇంట్లో ఏ నిర్ణయం తీసుకొన్నా మా అత్తామామలే తీసుకుంటారు.. అని అంటుంది ధాన్యలక్ష్మి. ఆ తర్వాత మా అక్కే అంటుంది ధాన్యలక్ష్మీ. దీంతో అలా వద్దు.. వాడి తల్లిగా మీరే నిర్ణయం తీసుకోండి అంటే.. నాకు ఓకే అంటుంది ధాన్యలక్ష్మి. ఇదంతా చూసి అప్పుకు చాలా కోపం వస్తుంది. మీ ఫ్యామిలీ గురించి చాలా గొప్పగా వినాను. ఈరోజు కళ్లారా చూస్తున్నాను. బంధాలకు మీరు చాలా గొప్ప విలువ ఇస్తున్నరు. నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు అనామిక తండ్రి. ఇంతలో రుద్రాణి మధ్యలోకి వస్తుంది. ప్రేమదేముందండి.. ఈరోజుల్లో వయసుకు వచ్చిన ప్రతి ఒక్కరు చేసేది అదే కదా. ఈ ఇంటికి మీ అమ్మాయిని కోడలుగా పంపించడానికి మీకున్నన అర్హతలు ఏంటి అని అడుగుతుంది రుద్రాణి. దీంతో మేము మీలా అంత బాగా సంపాదించలేకపోయినా.. మా స్థోమతకు తగ్గట్టుగా సంపాదించాం. ఏం లేని వాళ్లను మీరు కోడలుగా తీసుకొచ్చారని విన్నాం అంటుంది అనామిక తల్లి.
#image_title
అందరూ ఓకే అంటారు. మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుందాం అంటాడు సుభాష్. బేబీ నువ్వు కోరుకున్నట్టే కళ్యాణ్ తో పెళ్లి ఫిక్స్ చేశాను. నువ్వు హ్యాపీనే కదా అంటాడు అనామిక తండ్రి. సరే ఇక మాట్లాడాల్సింది అయిపోయింది కదా. ఇక పూజ మొదలు పెడదాం అంటుంది ఇంద్రాదేవి. ఇంతలో అనామిక.. ఆడవాళ్లంతా పనులు చేస్తే మీరు మగాళ్లు పూజలు చేస్తారా అంటుంది. అందరూ ఆడవాళ్లంతా కూడా అనామికకు సపోర్ట్ చేస్తారు. ఇక.. చివరకు ఆడాళ్లు, మగాళ్లు అన్నట్టుగా వాళ్ల మధ్య పోరు స్టార్ట్ అవుతుంది.
మేము కూడా తగ్గేదేలే అంటుంది కావ్య, లేదు.. మేము తగ్గేదేలే అంటాడు రాజ్. వామ్మో.. ఇంట్లో అడుగుపెట్టకముందే ఆడాళ్లు, మగవాళ్ల మధ్య గొడవ పెట్టేసింది అని రాహుల్ తో చెబుతుంది రుద్రాణి. ఎవరికి అన్యాయం జరగకుండా నేను ఒక నిర్ణయం తీసుకుంటాను.. అంటాడు. దీంతో ఒక ఆట ఆడుదాం.. ఎవరు గొప్పో తేలిపోతుంది అంటాడు సీతారామయ్య.
అందరూ గార్డెన్ కు వెళ్లగా మెల్లగా వినాయకుడి దగ్గర ఉన్న చీటీల్లో రాజ్ రాసింది తీసి చదువుదామని అనుకుంటుంది కావ్య. అందులో చేయి పెడుతుండగా కనకం వచ్చి కావ్య అంటుంది. అందరూ బయటికి వెళ్తే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే.. మా ఆయన తన మనసులో మాట చిట్టీలో రాశాడు. అది తెలుసుకుందామనుకుంటున్నా అంటుంది కావ్య. అలా చూడొద్దు పదా అని బయటికి తీసుకొస్తుంది.
బయట టగ్ ఆఫ్ వార్ నిర్వహిస్తాడు సీతారామయ్య. ఆడవాళ్లంతా ఒకవైపు, మగవాళ్లంతా మరోవైపు.. ఇద్దరూ కలిసి టగ్ ఆఫ్ వార్ నిర్వహిస్తారు. అందరూ గట్టిగా లాగుతారు. ఇంతలో కావ్య వెళ్లి రాజ్ మీద పడుతుంది. దీంతో అందరూ నవ్వుతారు. మేమే గెలిచాం అంటాడు మగాళ్లు.. లేదు మేమే గెలిచాం అంటారు ఆడాళ్లు. మా ఆడవాళ్లకు అన్యాయం చేస్తే మేము ఊరుకునేది లేదు అంటుంది కావ్య. ఆడ, మగ కలిస్తేనే జీవితాలకు పరిపూర్ణత వస్తుంది అంటుంది ఇందిరాదేవి. కలిసి జంటలుగా పోటీ చేయండి అంటాడు సీతారామయ్య. ఏ జంట గెలిస్తే వాళ్లే పూజలు చేస్తారు అంటాడు సీతారామయ్య. మొత్తానికి వినాయకుడి పండుగ రోజు అందరూ చాలా సంతోషంగా గడుపుతారు. టైమ్ దొరకగానే.. వెళ్లి కావ్య.. రాజ్ రాసిన చీటీని చదువుతుంది. చదివి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.