Home » Entertainment » Brahmamudi 7 October 2023 Saturday Full Episode
Entertainment

Brahmamudi 7 Oct Today Episode : చీటి చదివి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కావ్య.. రాజ్‌ను వదిలేసి కావ్య ఎక్కడికి వెళ్తుంది? ఆత్మహత్య చేసుకుంటుందా?

Authored By
Varun G
The Telugu News | Published on: October 7, 2023, 9:00 am
Advertisement

Brahmamudi 7 Oct Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. బ్రహ్మముడి సీరియల్ 7 అక్టోబర్ 2023, శనివారం ఎపిసోడ్ 221 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్పుకు చాలా కోపం వస్తుంది. దీంతో బయట కూర్చుంటుంది. దీంతో ఇక్కడ ఉన్నావు ఏంటే పదా తిందాం అంటే.. నాకు ఆకలిగా లేదు. నేను ఇంటికి వెళ్తా అంటుంది అప్పు. దీంతో ఏంటే అలా అంటున్నావు అంటుంది కనకం. నేను పోతున్నా. నాన్నను తీసుకొని నువ్వు వచ్చేయ్ అని చెప్పి వెళ్లిపోతుంది అప్పు. మరోవైపు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం భోజనాలు చేస్తుంటుంది. అప్పు ఎక్కడ అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. దీంతో ఇంటికి వెళ్లిపోయింది అంటుంది కనకం. ఆ తర్వాత నేను వడ్డిస్తాను అందరికీ అని కనకం అంటే.. పర్లేదు మీరు కూర్చోండి అంటుంది ధాన్యలక్ష్మి. ఆ తర్వాత కావ్యను రాజ్ పక్కన కూర్చోమంటుంది ధాన్యలక్ష్మీ. దీంతో వెళ్లి రాజ్ పక్కన కూర్చుంటుంది కావ్య. అందరూ ఇలా సంతోషంగా ఉండటంతో సీతారామయ్యకు చాలా సంతోషం వేస్తుంది. ఆ రోజుల్లో మనమంతా బంతి భోజనం చేసేవాళ్లం. మళ్లీ ఇవాళ ఇలా తినడం చాలా సంతోషంగా ఉంది అంటాడు సీతారామయ్య.

Advertisement

కట్ చేస్తే అన్నం తిన్నాక కావ్యను తీసుకొని రూమ్ కు తీసుకొస్తాడు రాజ్. ఏంటండి.. ఎవరైనా చూస్తారు అంటుంది కావ్య. ఇందాక భోజనం చేస్తున్నప్పుడు ఏంటి తెగ రెచ్చిపోయావు. అందరూ చూస్తే ఏమైనా అనుకుంటారు అని కూడా ఉండదా అని అంటాడు రాజ్. దీంతో అనుకుంటారు.. భార్యాభర్తలు చిలకాగోరింకల్లా ఉన్నారని అనుకుంటారు అంటుంది కావ్య. మనం కలిసిపోయాం అని అనుకోరా అంటాడు రాజ్. అంటే.. మనం కలవలేదా? మారడానికి ప్రయత్నిస్తా అన్నారు కదా. ఆ ఉద్దేశం లేదా అని కావ్య అంటే.. అలా ఎవరు అన్నారు. మారడానికి ప్రయత్నిస్తా అన్నా కదా అంటాడు రాజ్. ఇందాక బాణం కొట్టే సమయంలో నా నడుము పట్టుకొని బాణం కొట్టారు కదా అంటుంది కావ్య. దీంతో అయితే ఏంటి అంటాడు రాజ్. తాతయ్య చెప్పాడు కదా అని.. అంటూ ఏదో అనబోతూ మధ్యలో ఆగిపోతాడు రాజ్. ఏం చెప్పాడు అంటే.. తాతయ్య తన పరువు నిలబెట్టమన్నారు కదా అందుకని అలా చేశాను అంటాడు రాజ్.

#image_title

Advertisement

Brahmamudi 7 Oct Today Episode : కళ్యాణ్ విషయంలో బాధపడ్డ అప్పు

అంటే తాతయ్య చెబితేనే చేస్తారా? అంటుంది కావ్య. అసలు మీ మనసులో ఏముందో ఈ చీటి చదివితే చాలు అని అనుకుంటుంది కావ్య. ఎవ్వరూ చూడకుండా ఈ చీటిని చదవాలి అని అనుకొని.. వెంటనే బయటికి వెళ్లి ఆ చీటి ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తుంది కావ్య. దేవుడా నీకు అంతా తెలుసు. తాతయ్యకు ఇచ్చిన మాటతోనే నేను కళావతితో మంచిగా నటిస్తున్నా అని అందులో రాసి ఉండటం చూసి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ నాటకాన్ని ఆపించు. నాకు ఈ బాధ నుంచి విముక్తి కలిగించు.. అని రాసి ఉండటం చూసి షాక్ అవుతుంది కావ్య.

దీంతో ఏం చేయాలో కావ్యకు అర్థం కాదు. అక్కడి నుంచి అటే బయటికి వెళ్లిపోతుంది. మరోవైపు కనకం, మూర్తి ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు. నాకు ఆకలేస్తోంది.. ఏమైనా చేయి అని అడుగుతుంది అప్పు. అక్కడ తినకుండా వచ్చి ఇప్పుడు ఆకలి అని అరుస్తున్నావు అని కనకం అంటుంది. దీంతో అక్కడ ఆకలి వేయలేదు. ఇప్పుడు వేస్తోంది. ఏదైనా వండు అంటుంది అప్పు.

Advertisement

పెద్దమ్మ అప్పు పరిస్థితి చూసి అర్థం చేసుకుంటుంది. నువ్వు కళ్యాణ్ ను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు అంటుంది పెద్దమ్మ. మీ అక్కలు ఇద్దరూ ఆ ఇంటికి కోడళ్లుగా వెళ్లారు. నువ్వు కూడా ఆ ఇంటికి వెళ్తావా? కావాలని తన కూతుళ్లను వల వేసిందని అందరూ అనుకుంటారు. స్వప్న విషయంలోనే మీ అమ్మానాన్న చాలా బాధపడుతున్నారు అంటుంది పెద్దమ్మ. దీంతో అప్పు ఏదో చెప్పబోతే నువ్వు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా నువ్వే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అంటుంది పెద్దమ్మ.

ఇంతలో అప్పుకు కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. కానీ కట్ చేస్తుంది. మరోవైపు రాజ్ తన బెడ్ రూమ్ లోకి వస్తాడు. కానీ.. కావ్య కనిపించదు. ఏంటి మేడమ్ గారు ఇంకా రాలేదు. ఇంకా పండుగ అయినట్టు లేదు.. అని అనుకుంటాడు. ఇంత టైమ్ అవుతున్నా కళావతి కింద ఏం చేస్తోంది అని అనుకుంటాడు. ఇల్లు అంతా వెతుకుతాడు కానీ.. కావ్య కనిపించదు.

ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్లి కళావతి కనిపించిందా అని అడుగుతాడు. దీంతో తను నాకు కూడా కనిపించలేదు అంటుంది ధాన్యలక్ష్మీ. దీంతో రాజ్ కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో తాతయ్య దగ్గరికి వస్తాడు రాజ్. కళావతి ఇక్కడికి వచ్చిందేమో అని వచ్చాను అంటాడు. దీంతో మా దగ్గర ఎందుకు ఉంటుందిరా.. అంటాడు.

కావ్య కనిపించడం లేదని తెలిసి వెంటనే కనకం, మూర్తి దుగ్గిరాల ఇంటికి వస్తారు. ఏమైంది.. కావ్య ఎక్కడికి వెళ్లింది అని అడుగుతుంది కనకం. నువ్వు చెప్పు బాబు నా కూతురును ఏం చేశావు అని అడుగుతుంది కనకం. మీ అబ్బాయికి ఇష్టం లేకపోతే మీ ఇంట్లో ఉంచడంలో అర్థం లేదు. ప్రాణాలతో మా చేతుల్లో పెట్టండి. నాకు నా కూతురు కావాలి అని అడుగుతుంది కనకం.

Advertisement

మరోవైపు కావ్య కోసం అందరూ వెతకడం ప్రారంభిస్తారు. కావ్య ఎక్కడా కనిపించదు. ఒంటరిగా నడుస్తూ ఎక్కడికో వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి