#image_title
Brahmamudi 8 Sep Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు సెప్టెంబర్ 8 శుక్రవారం ఎపిసోడ్ 196 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రోజురోజుకూ సీతారామయ్య ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. అందుకే సీతారామయ్యతో కొంత సేపు సమయం కేటాయిస్తాడు రాజ్. కావ్యతో సంతోషంగా ఉన్నట్టు ఎంత నటిస్తున్నా సీతారామయ్య పసిగట్టేస్తాడు. అసలు నువ్వు కావ్యతో సంతోషంగా ఉంటున్నావా అని ప్రశ్నిస్తాడు సీతారామయ్య. నేను ఎంత నటించినా కూడా తాతయ్యకు డౌట్ వచ్చినట్టుంది అని అనుకుంటాడు రాజ్. మరోవైపు కనకం.. స్వప్నకు ఫోన్ చేస్తుంటుంది. కానీ.. ఫోన్ అస్సలు కలవదు. ఆ కడుపుతో ఉన్నది ఎక్కడికి వెళ్లిందో అంటూ కోపంగా ఉంటుంది కనకం. మరోవైపు ఇంట్లో వాళ్లంతా భోజనం చేస్తుంటారు. తాతయ్య ఆవకాయ వేసుకోబోతుండగా తాతయ్య మీరు ఆవకాయ తినకూడదు. ఇంత కారం ఉన్న, నిలువ ఉన్న పచ్చళ్లు తినొద్దు అంటాడు రాజ్.
#image_title
దీంతో అదేంటి బావ మొదటి ముద్ద ఆవకాయ ఖచ్చితంగా తింటాడు కదా. ఈరోజు కొత్తగా అడుగుతున్నారేంటి అని అడుగుతుంది నానమ్మ. దీంతో మొన్న నాన్న కింద పడ్డాడు కదా. బీపీ పెరిగింది కదా. ఎందుకు మళ్లీ కారం ఉన్నవి తినడం అని అంటాడు సుభాష్. దీంతో ఏమో మీకు ఎందుకు అంత ముందు జాగ్రత్త. మా కాలంలో ఏదైనా తినేవాళ్లం. మా బావ గట్టి మనిషి అంటుంది చిట్టి. ఆ తర్వాత అందరూ భోజనం చేస్తుండగా నువ్వు కూడా మాతో కలిసి కూర్చొని తినవచ్చు కదా అని అంటాడు రాజ్. దీంతో నేనా.. నేను వడ్డిస్తున్నాను కదా అంటుంది కావ్య. దీంతో వడ్డించాల్సినవి ఏమైనా కిలోమీటరు దూరం ఉన్నాయా? ఇక్కడే ఉన్నాయి కదా. రా కూర్చో అంటాడు రాజ్. దీంతో కావ్య రా కూర్చో. మనవడు చెబుతున్నాడు కదా అంటాడు సీతారామయ్య. దీంతో సరే అని కూర్చుంటుంది. నీ అత్త పదవి గోవింద అని మళ్లీ రుద్రాణి.. అపర్ణను రెచ్చగొడుతుంది. కావ్యకు రాజ్ వడ్డిస్తాడు. అన్నం, కూర పెడతాడు.
కళావతిని సంతోషంగా చూసుకుంటున్నట్టు తాతకు అర్థం కావాలని రాజ్ అలా చేస్తాడు కానీ.. మిగితా వాళ్లంతా వేరే విధంగా అర్థం చేసుకుంటారు. తనకు వడ్డించి తిను అంటాడు రాజ్. తను తింటుంటే పొర పోతుంది. దీంతో అయ్యో అని తన మీద చేతితో కొట్టి వాటర్ తాగు అని తాగిస్తాడు. దీంతో అందరూ ఆ సీన్ చూసి షాక్ అవుతారు. తాతయ్య, నానమ్మ సంతోషిస్తారు. నెమ్మదిగా తినను అంటాడు. అపర్ణకు కోపం వస్తుంది. రుద్రాణి తన నవ్వు ఆపులోకపోతుంది. కావ్య మాత్రం చాలా సంతోషిస్తుంది. తన భర్త తనను ఇంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉండటంతో చాలా సంతోషిస్తుంది. ఏమండి నేను తినేశాను. ఇక లేస్తాను అంటుంది కావ్య. సరే అంటాడు. తను లేస్తుండగా తన చీర కొంగు రాజ్ వాచ్ కి తట్టుకుంటుంది. దీంతో రాజ్ కి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇద్దరూ సిగ్గుపడతారు.
మరోవైపు అనామిక.. కళ్యాణ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తన ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది. నీకూ ఈ ఫోటో చూపించాలని అనుకుంటున్నా కానీ.. నాకు ఎందుకో భయం వేస్తోంది అని అనుకుంటుంది. ఇంతో సుబ్రహ్మణ్యం వచ్చి నువ్వు తీసుకొచ్చిన అబ్బాయి ఫోటోలో కంటే నిజంగానే బాగున్నాడు అంటాడు. ఫోటో ఏంటి అంటుంది. దీంత నీ లైఫ్ లో జరిగే ప్రతి విషయం నాకు తెలుసు అంటాడు. ఏంటి డాడీ స్టాకింగ్ చేస్తున్నావా అంటే లేదు బాధ్యత అంటాడు సుబ్రమణ్యం. ఎప్పుడు ఆ అబ్బాయికి నీ లవ్ విషయం చెబుతున్నావు. ఆల్ ది బెస్ట్ అంటూ అనామికను ఎంకరేజ్ చేస్తాడు సుబ్రమణ్యం.
కట్ చేస్తే.. వాచ్ కి తగిలి కళావతి చీర కొంగు తట్టుకోవడంతో రాజ్ కి చాలా కోపం వస్తుంది. అసలు ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందని టెన్షన్ పడతాడు. వాచ్ పై చిరాకు పడతాడు. మరోవైపు కళావతిని అమ్మమ్మ పిలిచి ఈ పూతు పెట్టుకో అంటుంది. దీంతో దేవుడి పూలా అంటే.. చెట్ల పూలు అంటుంది. ఎందుకు అంటే.. నీ తలకాయ.. నీ మొగుడి కోసం అంటుంది. పూలు పెడుతుంది తన తలమీద. ఇంతలో పాలు కూడా తీసుకురావడంతో మీ మనవడు శోభనం అనుకుంటాడు అంటుంది. దీంతో అదేంటి మీరు సవ్యంగా కాపురం చేయడం లేదా అంటుంది. దీంతో లేదు లేదు ఇప్పుడు ఇవన్నీ అంటే నన్ను మీ మనవడు నిద్రపోనివ్వడు అంటుంది కావ్య.
పాలు, పూలు తీసుకొని కావ్య లోపలికి వెళ్తుంది. పాలను చూసి షాక్ అవుతాడు. ఇవన్నీ ఏంటి అంటాడు. పాఠం అండి. పాల పాఠం, పూల పాఠం అంటుంది. నీ పాటలకు ఒక దండం అంటాడు రాజ్. కట్ చేస్తే ఉదయమే కళావతి లేచి కృష్ణుడికి పూజ చేస్తుంది. ఆ తర్వాత రాజ్ అందరి ముందు కళావతికి ఒక గిఫ్ట్ ఇస్తాడు. అందరి ముందే తన మెడలో వేస్తాడు. దీంతో అపర్ణ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
War 2 | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 .కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన…
Barrelakka | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో “బర్రెలక్క”గా అందరి దృష్టిని ఆకర్షించిన శిరీష్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచింది.…
Hansika | స్టార్ హీరోయిన్ హన్సిక వ్యక్తిగత జీవితంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు హల్‌చల్ చేస్తున్న…
LOBO | టీవీ నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్, యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.…
Sleep | మానసిక ఒత్తిడి, ఆహార అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో…
Clove Side Effects | లవంగం అనేది మన ఇండియన్ కిచెన్‌లో తప్పనిసరి సుగంధ ద్రవ్యం. వండిన ఆహారానికి రుచి,…
Health Tips | పాలు, పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థాలుగా ఎంతో మందికి తెలిసిందే. అయితే…
Health Tips | పిస్తా పప్పులు కేవలం రుచికరమైన వంటకాలలో చేర్చే ఒక సాధారణ పదార్థమే కాదు… ఇవి మన…
This website uses cookies.