#image_title
Brahmamudi 9 Oct Monday Episode Highlights : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. బ్రహ్మముడి 9 అక్టోబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 222 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్పుకు కోపం వచ్చి దుగ్గిరాల ఇంట్లో భోజనం చేయకుండానే తన ఇంటికి వెళ్లిపోతుంది. కనకం ఎంత చెప్పినా వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పు ప్రవర్తన చూసి కనకానికి ఏం చెప్పాలో అర్థం కాదు. కళ్యాణ్ ప్రవర్తిస్తున్న తీరుపై అప్పుకు చాలా కోపం వస్తుంది. అసలు అనామికతోనే ఉంటూ తనను కళ్యాణ్ పక్కన పెడుతున్నాడని అప్పును కళ్యాణ్ పిలిచినా కూడా అనామిక ప్రతిసారి మధ్యలో దూరడం అప్పుకు నచ్చలేదు. దీంతో ఇంటికి వెళ్లిపోతుంది. మరోవైపు దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్లు అందరూ కలిసి కూర్చొని భోజనాలు చేస్తారు. సీతారామయ్య, ఇంద్రాదేవి ఇద్దరికీ అలా అందరూ కలిసి భోజనాలు తినడం చాలా సంతోషంగా అనిపిస్తుంది.
మరోవైపు రాజ్ రాసిన చీటీ ఎప్పుడు చదవాలా అని అనుకుంటుంది కావ్య. ఇందాక పక్కన కూర్చొని తింటున్నప్పుడు ఏంటి అలా చేస్తున్నావు అంటూ కావ్యను రాజ్ ప్రశ్నిస్తాడు. మనం కలిసిపోయాం అని అనుకోరా? అంటాడు రాజ్. అంటే మీరు కలవకూడదు అని అనుకుంటున్నారా? మారడానికి ప్రయత్నిస్తా అన్నారు కదా. మరి ఆ ఉద్దేశం లేదా? అని అడుగుతుంది కావ్య. దీంతో అని ఎవరు అన్నారు. దేనికైనా టైమ్ పడుతుంది కదా అంటాడు. ఇందాక ఆర్చరీ గేమ్ లో నా నడుము పట్టుకొని గట్టిగా లాక్కొని ఆడారు కదా అంటుంది కావ్య. ఎలా అయితే ఏంటి.. తాతయ్య గెలవాలన్నారు కదా. అందుకే నేను అలా చేశాను అంటాడు రాజ్. అసలు మీ మనసులో ఏముందో ఈ చీటీ చదివితే తెలుస్తుంది లేండి అని అనుకుంటుంది కళావతి.
#image_title
ఆ తర్వాత గార్డెన్ లోకి వెళ్లి ఎవరూ లేరు అని చూసుకొని అక్కడ కూర్చొని రాజ్ రాసిన చీటీ చదువుతుంది కావ్య. దేవుడా నీకు అంతా తెలుసు. తాతయ్యకు ఇచ్చిన మాట కోసమే నేను కళావతితో మంచిగా ఉన్నట్టు నటిస్తున్నా.. అని అందులో రాసి ఉండటం చూసి కళావతి షాక్ అవుతుంది. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ నాటకాన్ని ముగించు. నాకు ఈ బాధ నుంచి విముక్తిని కలిగించు.. అంటూ రాసి ఉంటుంది. దీంతో ఏం చేయాలో కావ్యకు అర్థం కాదు.
వెంటనే ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతుంది. మరోవైపు కనకం, మూర్తి ఇద్దరూ ఇంటికి వస్తారు. అప్పు నేను ఏం తినలేదు. నాకు ఆకలి వేస్తోంది. ఏదైనా చేయి అంటుంది. దీంతో నువ్వు ఎందుకు అక్కడ ఏం తినకుండా వచ్చావు అని అడుగుతుంది పెద్దమ్మ. నువ్వు కళ్యాణ్ ను ఇష్టపడుతున్నావు కదా. వద్దు అని అంటుంది పెద్దమ్మ. ఇప్పటికీ స్వప్న, కావ్య ఇద్దరూ ఆ ఇంటి కోడళ్లు అయ్యారు. ఇప్పుడు నువ్వు కూడా అంటే.. కావాలని డబ్బున్న వాళ్లను చూసి ఎర వేశారని వాళ్లు అనుకుంటారు.
స్వప్న స్వార్థంతో ఆ ఇంటికి వెళ్లింది. కావ్య పరిస్థితి ఎలా ఉందో చూశావు కదా. నీ విషయంలో ఇంకెన్ని మాటలు అంటారో తెలుసా? కావ్యకు ఇందులో ఏ సంబంధం లేదని నువ్వు చెప్పినా వాళ్లు నమ్ముతారా? మీ అమ్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బు కోసమే వాళ్ల సంబంధం తీసుకొచ్చింది. ఇప్పటికే మీ నాన్న స్వప్న విషయంలో జరిగిన అవమానానికి కుంగిపోయాడు. మళ్లీ అలా జరిగితే తట్టుకోగలడా మీ నాన్న అంటుంది పెద్దమ్మ.
మరోవైపు కావ్య కనిపించడం లేదని ఇంట్లో అంతా వెతుకుతాడు రాజ్. కానీ.. కావ్య కనిపించదు. వెంటనే కనకానికి చెప్పడంతో మళ్లీ ఇంటికి వస్తుంది. ఏమైంది కావ్యకు ఏమైంది అని అడుగుతుంది. తెలియదు అంటుంది అపర్ణ. దీంతో ఏమైందో తెలియదా.. ఎక్కడికి వెళ్లిందో తెలియదా అని అడుగుతుంది. నిజం చెప్పు బాబు.. నా కూతురును ఏం చేశావు అని అడుగుతుంది కనకం.
మీకు ఇష్టం లేకపోతే.. మీ అబ్బాయికి ఇష్టం లేకపోతే అసలు ఈ ఇంట్లో నా కూతురును ఉంచడంలో అర్థం లేదు అని అంటుంది కనకం. ప్రాణాలతో మా చేతుల్లో పెట్టండి. నాకు నా కూతురు కావాలి.. అంటుంది కనకం. మరోవైపు కళ్యాణ్, అప్పు, రాజ్ అందరూ కావ్య కోసం వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
This website uses cookies.