Brahammudi 9 Sep Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 9 సెప్టెంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 197 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలు తీసుకొని, జడలో మల్లెపూలు పెట్టుకొని కావ్య.. బెడ్ రూమ్ లోకి వెళ్తుంది. తనను అలా చూసి షాక్ అవుతాడు రాజ్. వామ్మో.. ఇదేంటి ఏదో ప్లాన్ చేసినట్టుంది అని అనుకుంటాడు రాజ్. అంటే నేను మూడు నెలలు సమయం ఇచ్చాను కదా అంటాడు రాజ్. అమ్మమ్మ పూలు ఇచ్చింది. పాలు కూడా తెచ్చి ఇవ్వడంతో నేను తెచ్చాను. అంతే కానీ వేరే ఉద్దేశంతో కాదు అంటుంది. దీంతో సరే నేను పాలు తాగుతాను అని డౌట్ గానే తాగుతాడు రాజ్. మరోవైపు కళ్యాణ్.. అనామిక ఫోటోనే చూస్తూ మురిసిపోతుంటాడు. మీ ఇంటికి తీసుకెళ్లి నన్ను పరిచయం చేశావంటే నువ్వు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో నాకు అర్థం అయింది. కానీ.. నేను నిన్ను ఇష్టపడుతున్నట్టే నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావా? నీకు నా మనసులో మాట ఎలా చెప్పాలి. చెప్తే ఏం అనుకుంటావు. బ్రోను అడుగుదాం. ఏదైనా ఐడియా ఇస్తుందేమో అని అనుకుంటాడు కళ్యాణ్.
వెంటనే అప్పుకు ఫోన్ చేస్తాడు. కానీ.. అప్పు ఫోన్ కట్ చేస్తుంది. ఇదేంటి బ్రో కట్ చేసింది అని అనుకుంటాడు. ఇంటికి వెళ్లి మరీ కూల్ చేశా కదా. ఇంకా కోపం తగ్గలేదా అని అనుకుంటాడు. మరోసారి ఫోన్ చేస్తాడు. దీంతో మళ్లీ ఫోన్ కట్ చేయకుండా ఎత్తుతుంది. కట్ చేస్తుంటే మళ్లీ చేస్తున్నావు ఏంటి అంటుంది. దీంతో ఇంకా నా మీద కోపం తగ్గలేదా అంటే అంతలేదు.. ఏదైనా ఉంటే నేను మొహం మీదనే చెప్తా. పని ఉండి కట్ చేశా అంటుంది. దీంతో బ్రో బ్రో అంటూ నాకు ఒక హెల్ప్ కావాలి బ్రో అంటాడు. నా కోసం ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడలేవా అని అడుగుతాడు. ఇంతలో అనామిక.. కళ్యాణ్ కు ఫోన్ చేస్తుంది. దీంతో బ్రో… నేను ఒక 5 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తా అని కట్ చేసి.. అనామిక ఫోన్ ఎత్తుతాడు. ఏంటి మీ ఫోన్ బిజీగా వస్తోంది అంటే.. బ్రో తో మాట్లాడుతున్నా అంటాడు. ఏంటి ఎప్పుడూ ఆమెతోనే తిరుగుతూ ఉంటావు. నీకు అబ్బాయిలతో ఫ్రెండ్ షిప్ లేదా అని అంటుంది. ఏంటి నేను అమ్మాయిలతో మాట్లాడితే మీకు ఇష్టం ఉండదా అంటే అదేం లేదు అంటుంది. దీంతో అవును అని అబద్ధం చెప్పొచ్చు కదా అంటాడు. అసలు వీడు ఏం చేస్తున్నాడు అని అనుకొని కోపంతో కళ్యాణ్ కు ఫోన్ చేస్తుంది కానీ.. ఫోన్ బిజీ వస్తుంది. ఫోన్ అస్సలు ఎత్తడు కళ్యాణ్. దీంతో తనకు చాలా కోపం వస్తుంది.
మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తున్న కనకానికి కారులో వెళ్తున్న రాహుల్ కనిపిస్తాడు. ఇదేంటి రాహుల్ కారులో వెళ్తున్నాడు. కావ్య ఏమో హనీమూన్ కు వెళ్లారని చెప్పింది అని అనుకొని వెంటనే రుద్రాణికి ఫోన్ చేస్తుంది. రాహుల్ నాకు రోడ్డు మీద కనిపించాడు అని చెబుతుంది. దీంతో షాక్ అవుతుంది రుద్రాణి. వీడొక్కడు చాలు నన్ను రోడ్డు మీదికి తీసుకురావడానికి అని అనుకుంటుంది రుద్రాణి. మా అబ్బాయి కనిపించడం ఏంటి. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో? వాళ్లు ఊటీలో ఉన్నారు. వాళ్లు హైదరాబాద్ లో ఎలా కనిపిస్తారు. అసలు మీకు ఈ అనుమానం ఎలా వచ్చింది. మీ అమ్మాయితో మీరు రోజూ మాట్లాడటం లేదా? మీ అమ్మాయి కాపురానికి రాగానే పక్కన పెట్టారా? అంటే లేదు. నేను రోజూ మాట్లాడుతున్నా? అంటూ చెబుతుంది కనకం.
వెంటనే రాహుల్ కు ఫోన్ చేసి సీరియస్ అవుతుంది రుద్రాణి. ఇంత ఎర్లీగా లేచావా అని అడుగుతాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే.. హోటల్ లో ఉన్నాను అంటాడు. దీంతో మీ హోటల్ మనికొండలో ఉందా అంటే ఏం మాట్లాడుతున్నావు మామ్ అంటాడు. ఆమె నిన్ను మనికొండలో చూసిందట. పని పూర్తయ్యే వరకు నువ్వు బయటికి రావద్దని చెప్పానా? మనం చేస్తున్న పని చాలా రిస్క్ తో కూడుకున్నది. నువ్వు ఇలా చిన్న చిన్న తప్పులు చేసి దొరికిపోతే మనం జీవితాంతం వాళ్ల కాళ్ల మీద పడి బతకాల్సి వస్తుంది అంటుంది రుద్రాణి.
మరోవైపు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉదయమే లేచి పూజలు చేస్తుంది కావ్య. తనను చూసి అందరూ మెచ్చుకుంటారు. రుద్రాణికి కోపం వస్తుంది. ఇంతలో రుద్రాణి మళ్లీ ఏదో పుల్ల పెట్టడానికి ప్రయత్నిస్తుంది. పూజ చేస్తే కూడా అందులో తప్పు తీయాలా అని రాజ్ కూడా సీరియస్ అవుతాడు. ఇల్లు భజన మందిరంలా కనిపిస్తే మీరు భజన చేయకుండా మీ రూమ్ లోనే కూర్చోండి అంటాడు రాజ్. దీంతో కావ్యకు చాలా సంతోషం వేస్తుంది.
మరోవైపు కనకం కూడా ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేస్తుంది. నాకు ప్రసాదం పెట్టండి అని అడుగుతుంది అప్పు. ఇంతలో అప్పుకు ఎవరో ఫోన్ చేసి గ్రౌండ్ ను కబ్జా చేశారని చెబుతాడు. దీంతో ఎవడ్రా వాడు. మన గ్రౌండ్ ను కబ్జా చేసింది. నేను వచ్చానంటే వాళ్ల కాళ్లు చేతులు ఇరగ్గొడుతా అంటుంది. మరోవైపు కావ్యకు ఈ ఇంటి కోడలునేని నమ్మకం వచ్చింది అంటుంది కావ్య. దీంతో అపర్ణకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.