Home » Entertainment » Brahmanandam Funny Comments In Sarkar Noukari Movie Promotions
Entertainment

Brahmanandam : సినిమాలో అవకాశం ఇవ్వరు కానీ ప్రమోషన్స్ మాత్రం చేపించుకుంటారు.. బ్రహ్మానందం ఫన్నీ కామెంట్స్..!

Authored By
Anusha V
The Telugu News | Updated on: December 24, 2023 11:28 am
Advertisement

Brahmanandam : ప్రముఖ సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా చేస్తున్న సర్కార్ నౌకరి  సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.ఈ సినిమాలో హీరోయిన్గా భావన నటిస్తుంది. ఈ సినిమాను ఆర్కే టెలి షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న థియేటర్స్ లో గ్రాండ్గా విడుదల కాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తోంది.

Advertisement

ఈ క్రమంలోనే సర్కారు నౌకరి సినిమాను స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ప్రమోట్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సర్కారు నౌకరి సినిమా కొత్తగా యువతను ఆకట్టుకునేలా ఉంది అన్ని అన్నారు. ఇక ఆకాష్ హిందీ యాక్టర్ లాగా కనిపిస్తాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. తన తల్లి సునీతకి వచ్చిన పేరు ఆకాష్ కి కూడా వస్తుందని భావిస్తున్నాను అని అన్నారు. సర్కారు నౌకరి అంటే ప్రజలకు సేవ చేసే ఉద్యోగం అనే సందేశం తో వినూత్నమైన రీతిలో డైరెక్టర్ శేఖర్ దర్శకత్వ వహించారు అని, హీరోయిన్ భావన పల్లెటూరి అమ్మాయిల అద్భుతంగా నటించారు అని, ఇక ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని బ్రహ్మానందం ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజాగా విడుదలైన సర్కారు నౌకరి ట్రైలర్‌లో గోపాల్ అనే వ్యక్తికి మండల కార్యాలయంలో ఉద్యోగం వస్తుంది. కొత్తగా పెళ్లయినా గోపాల్ భార్యను తీసుకుని ఓ మారుమూల గ్రామానికి వస్తాడు. ఆ గ్రామంలో నిరోధ్ వాడకం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం గోపాల్ పని. కానీ ఆ పని నుంచి గోపాల్‌కు వ్యతిరేకత వస్తుంది. కండోమ్‌ వాడమని చెబితే అదొక దరిద్రం అంటూ విముఖత చూపుతారు. అప్పటివరకు సర్కారు నౌకరోడి భార్య అని గౌరవంగా చూసుకున్న అతని భార్యను చిన్నచూపు చూస్తారు. బుగ్గలోడు అంటూ హేళన చేస్తారు. దీంతో గోపాల్ కాపురంలో కండోమ్ కష్టాలు తెచ్చిపెడుతుంది. ట్రైలర్ ఫన్ అండ్ ఎమోషనల్‌గా ఆసక్తిగా సాగింది. సర్కారు నౌకరి అంటే సర్కారు జీతం తీసుకోవడం కాదు సార్. ప్రజలకు సేవ చేయడం అంటూ ట్రైలర్ చివర్లో చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది.

Anusha V

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి