
#image_title
Brahmamudi 6 Sep Today Episode : బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 6 సెప్టెంబర్ 2023, బుధవారం ఎపిసోడ్ 194 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదయమే కావ్య ముగ్గు వేస్తూ ఉంటుంది. తన ముగ్గును చూడకుండా తొక్కుతాడు. దీంతో ముగ్గు అని అరుస్తుంది. ఏంటి అంటే ముగ్గు అంటుంది. దీంతో తొక్కలో ముగ్గుకు ఇంత సీన్ క్రియేట్ చేయడం అవసరమా అంటాడు. ఇంతలో తాతయ్య అటువైపు వెళ్తుండగా చూసి అమ్మో.. ఇప్పుడు మనం దీన్నే అవకాశంగా వాడుకోవాలి అనుకొని ముగ్గు ఎంత బాగుంది అని అంటాడు. సూపర్బ్ ముగ్గు. నువ్వు చాలా బాగా ముగ్గు వేశావు అని పొగుడుతాడు. అప్పుడే అపర్ణ, రుద్రాణి అక్కడికి వస్తారు. అపర్ణను తక్కువ చేస్తూ కావ్యను పొగుడుతాడు. దీంతో ఇంకా ఎక్కువ లాగితే అమ్మను తక్కువ చేసినట్టు అవుతుంది అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
#image_title
కట్ చేస్తే కళ్యాణ్, అప్పు ఇద్దరూ బైక్ లో వెళ్తుండగా.. అనామిక కారులో వెళ్తూ వాళ్లను చూసి వాళ్లను ఆటపట్టిస్తుంది. వాళ్ల ముందు కారు వెళ్లనిస్తుంది. దీంతో బైక్ అదుపుతప్పి కింద పడుతుంది. ఇద్దరూ కింద పడతారు. అప్పుకు కోపం వచ్చి కారు దగ్గరికి వెళ్లి డోర్ తీయ్ అంటుంది. చూస్తే అనామిక. తను ఎవరో తెలియక తన మీద విరుచుకుపడుతుంది. అసలు ఎవరు నువ్వు. చంపేద్దాం అనుకున్నవా అంటూ సీరియస్ అవుతుంది. ఇంతలో ఆమెను చూసిన కళ్యాణ్.. బ్రో ఆమె అనామిక అంటాడు. ఓహో.. అనామికనా. అయితే మాత్రం మమ్మల్ని చంపేద్దాం అనుకున్నావా అని అడుగుతుంది అప్పు. దీంతో లేదు.. నేను పని మీద వెళ్తుంటే కళ్యాణ్ కనిపించాడు. అందుకే కళ్యాణ్ ను ఆటపట్టిందాం అని అనుకున్నా అంటుంది. సరే.. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు కళ్యాణ్. దీంతో బయటికి వెళ్తున్నా అంటుంది. పదా నేను వస్తా అంటాడు. అప్పును ఎలాగోలా బతిమిలాడి పంపించేసి అనామికతో కలిసి వెళ్తాడు కళ్యాణ్.
మరోవైపు కళ్యాణ్ ఆఫీసుకు రెడీ అవుతాడు. టిఫిన్ రెడీ అయిందా అంటే అవుతుంది అండి ఒక 10 నిమిషాలు పడుతుంది అంటుంది. నాకు టైమ్ లేదు అంటాడు. దీంతో సరే నువ్వు వెళ్లు. కావ్య టిఫిన్ మీ ఆఫీసుకు పట్టుకొస్తుంది అంటాడు తాతయ్య. దీంతో ఏం చెప్పాలో కళ్యాణ్ కు అర్థం కాదు. అందరి ముందు ఏం మాట్లాడలేక సరే అంటాడు. కావ్యతో వెళ్లొస్తాను అని చెప్పేసరికి షాక్ అవుతుంది అపర్ణ.
కట్ చేస్తే.. అనామిక, కళ్యాణ్ ఇద్దరూ కలిసి… అనామిక ఇంటికి వెళ్తారు. ఇప్పుడు మీ ఇంటికి ఎందుకు అంటే.. పేరెంట్స్ ను సర్ ప్రైజ్ చేయడానికి అంటుంది అనామిక. ఇంట్లోకి కళ్యాణ్ ను తీసుకెళ్లి వాళ్ల అమ్మ, నాన్నకు పరిచయం చేస్తుంది. ఆ తర్వాత తన రూమ్ లోకి కళ్యాణ్ ను తీసుకెళ్తుంది. తన రూమ్ లో ఆయన కవితలను మొత్తం ఫ్రేమ్ చేసుకొని పెట్టుకుంటుంది. అవి చూసి ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత కళ్యాణ్ ఫోటో అక్కడ ఉంటే.. దాన్ని కళ్యాణ్ చూడకుండా పోయి అడ్డంగా నిలబడుతుంది.
మరోవైపు నీ కొడుకు, కోడలు ఎక్కడ రుద్రాణి అని అడుగుతుంది నానమ్మ. దీంతో నాకు తెలియదు అంటుంది. దీంతో నీ కొడుకు, కోడలు ఎక్కడికి వెళ్లారో కూడా తెలియదా అంటే.. ఈ ఇంట్లో జరిగే గొడవలతో వాళ్లు బాగా డిస్టర్బ్ అయ్యారట. అందుకే ఓ 10 రోజులు ప్రశాంతంగా గడుపుదామని బయటికి వెళ్లారు అంటుంది రుద్రాణి. దీంతో కడుపుతో ఉన్న పిల్ల అని కూడా తెలియదా. అలా ఎలా పంపిస్తారు.. అంటూ అందరూ రుద్రాణి మీద సీరియస్ అవుతారు. అపర్ణ కూడా తనపై సీరియస్ అవుతుంది. తాతయ్య కూడా బాధ్యతగా ఉండాలి. కడుపులో ఉన్న బిడ్డకు ఏమైనా అయితే ఎవరు సమాధానం చెబుతారు అని సీరియస్ అవుతాడు.
వాళ్లు ఇంత హటాత్తుగా ఎందుకు వెళ్లారు. ఏదో జరిగింది. ఏదైనా గొడవ జరిగిందా? మా పుట్టింట్లో వదిలేయడానికి వెళ్లారా? అని అడుగుతుంది కావ్య. దీంతో ఏ గొడవలు లేవు. వాళ్లు సంతోషంగానే ఉన్నారు అంటుంది రుద్రాణి. దీంతో వాళ్లకు ఇప్పుడే ఫోన్ చేసి వెనక్కి రమ్మను అంటుంది. దీంతో ఫోన్ చేస్తుంది కానీ.. ఫోన్ కలవదు. ఫోన్ కలిసినప్పుడు చెప్తా అంటుంది రుద్రాణి.
ఆ తర్వాత కావ్య కూడా స్వప్నకు ఫోన్ చేస్తుంది కానీ.. కలవదు. దీంతో కావ్య టెన్షన్ పడుతుంది. ఏమైంది అని అనుకుంటుంది. మరోవైపు అందరూ భోంచేస్తుండగా కావ్య వడ్డీస్తూ ఉంటుంది. తాతయ్య ముందు ఓవర్ యాక్షన్ చేయాలని నువ్వు కూడా మాతో కలిసి కూర్చొని భోం చేయి అంటాడు. దీంతో కావ్యకు ఏం చెప్పాలో అర్థం కాదు.. నేను వడ్డిస్తా అని చెప్పి వడ్డిస్తాడు రాజ్. తనకు పొరబోతే నీళ్లు కడా తాగిస్తాడు రాజ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
This website uses cookies.