Home » Entertainment » Bro Movie 2nd Day Collections
Entertainment

Bro Movie 2nd Day collections : బ్రో మూవీ సెకండ్ డే కలెక్షన్స్ ఫుల్ రిపోర్ట్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: July 30, 2023 8:12 am
Advertisement

Bro Movie 2nd Day collections : పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన బ్రో సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మొదటి మూడు రోజులు కలెక్షన్ చూసుకో అక్కరలేదని గతంలో చాలా సినిమాలు రుజువు చేశాయి. తెలుగు చలనచిత్ర రంగంలో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టే హీరోలలో పవన్ ఒకరు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఫస్ట్ టైం పవన్ మల్టీస్టారర్ చేయడంతో ఈ సినిమా మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. సముద్ర కని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 28వ తారీకు విడుదలైన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సినిమాలో పవన్ నటన చాలా హైలెట్ గా నిలిచింది. చాలాకాలం తర్వాత పవన్ నీ కామెడీ యాంగిల్.. ఒకప్పటి సినిమాలు గుర్తు చేసేలా “బ్రో”లో నటన తీరు ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. తమిళంలో “వినోదయ సీతం” సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దాదాపు 140 కోట్ల రూపాయలతో నిర్మించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 95 కోట్లకు పైగానే చేసినట్లు టాక్. ముఖ్యంగా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే మరియు డైలాగులు త్రివిక్రమ్ అందించడంతో భారీగా అంచనాలు పెరిగాయి. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా కలిపి 1600 స్క్రీన్ లలో విడుదల చేయడం జరిగింది. అయితే “బ్రో ది అవతార్” మొదటి రోజు కలెక్షన్లు ఆంధ్రా ప్రదేశ్, తెలంగాణ‌లో 35 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.

Bro Movie 2nd Day collections

Advertisement

కర్ణాటకలో 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లను, మిగితా రాష్ట్రాల్లో 75 లక్షలు, ఓవర్సీస్‌లో 9 కోట్ల రూపాయలు రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 30 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 49 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక రెండో రోజు కలెక్షన్ల లెక్కలు చూస్తే 20 కోట్ల గ్రాస్ 40 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ గా “బ్రో” ఉందని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇక ఆదివారం కూడా కలెక్షన్స్ ఈ రకంగానే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి