Home » Entertainment » Bro Movie Public Talk
Entertainment

Bro Movie Public Talk : పవన్ కళ్యాణ్.. బ్రో మూవీ పబ్లిక్ టాక్ వీడియో..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: July 28, 2023, 1:00 pm
Advertisement

Bro Movie Public Talk : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన “BRO” నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్, ఎనర్జీతో ఎంతో ఆకట్టుకుంటున్నారు. బ్రో సినిమా చూసి బయటకు వస్తున్న అభిమానులు పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ యాక్టింగ్ తో పాటు కామెడీ టైమింగ్ అదిరిపోయిందని బయట ఉన్న వెబ్ మీడియా ఛానల్స్ కి తెలియజేస్తున్నారు.చాలాకాలం తర్వాత పవన్ కళ్యాణ్ లైట్ గడ్డం లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపించడం జరిగింది.

Advertisement

కామెడీ నేపథ్యంలో ఫ్యాంటసీ తరహాలో వచ్చిన ఈ సినిమాలో పవన్ డైలాగ్స్ తో పాటు తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఫస్టాఫ్, క్లైమాక్స్, కామెడీ, పవన్ పాత పాటలు సినిమాలో అభిమానులను ఎంతగానో అలరించాయి. బ్రో సినిమా చూసి థియేటర్ బయటకు వస్తున్న ప్రేక్షకులు పబ్లిక్ టాక్ లో కాలర్ ఎగరేసే రీతిలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. చాలాకాలం తర్వాత పవన్ కళ్యాణ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫ్లేవర్ ఈ సినిమాలో దొరికిందని చెప్పుకొస్తున్నారు.

Bro Movie Public Talk

Advertisement

దర్శకుడు సముద్ర గాని మెగా ఫాన్స్ పవన్ నీ.. ఎలాగ చూడాలని అనుకున్నారో అదే రీతిలో చూపించారని చెప్పుకొస్తున్నారు. తమిళంలో తెరకెక్కిన “వినోదయ సీతం” సినిమాకి తెలుగులో రీమేక్ గా వచ్చిన ఈ “బ్రో”లో వన్ మ్యాన్ షోగా పవన్ కళ్యాణ్ తన హైలెట్ నటనతో స్క్రీన్ చించేసారట. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో..”బ్రో” కలెక్షన్స్ రికార్డు స్థాయిలో వస్తున్నట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి