Home » Entertainment » Bullet Bhaskar Father About Rashmi Gautam Love Story In Extra Jabardasth Show
Entertainment

Rashmi Gautam : యాంకర్ రష్మీని ఇబ్బందిపెడుతున్నారా?.. హద్దులు దాటుతున్న బుల్లెట్ భాస్కర్ తండ్రి

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 26, 2022, 8:30 pm
Advertisement

Rashmi Gautam : యాంకర్ రష్మీ సుధీర్ మధ్య ఏమీ లేదని అందరికీ తెలిసిందే. కానీ ఏదో ఉందనేలా క్రియేట్ చేస్తుంది మల్లెమాల టీం, జబర్దస్ట్ కంటెస్టెంట్లు. ఇక ప్రతీసారి ఈ ఇద్దరి జోడి మీద కౌంటర్లు వేస్తుంటారు. ఈ మధ్య అయితే సుధీర్ పక్క చానెల్‌కు వెళ్లడంతో ఇలా రష్మీ మీద మరింత ఎక్కువ సెటైర్లు వేస్తున్నారు. నీ వల్లే అటు వెళ్లిపోయాడు.. మీ ఇద్దరి కలిసి ప్లాన్ చేశారు కదా? అంటూ స్టేజ్ మీద రష్మీని కార్నర్ చేస్తున్నారు. తాజాగా వదిలిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో అయితే బుల్లెట్ భాస్కర్ తండ్రి మరింత రెచ్చిపోయాడు. బుల్లెట్ భాస్కర్ తండ్రికి మంచి అవకాశాలే వస్తున్నాయి.

Advertisement

అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్లలో కనిపించి, తన కొడుకు మీద సెటైర్లు వేస్తూ బాగానే ఆకట్టుకున్నాడు. అలా చివరకు జబర్దస్త్ ఫ్యామిలీలో ఒకడిగా మారిపోయాడు. అతను ఇప్పుడు స్కిట్లలో కూడా నటించేస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ తండ్రే హైలెట్ అయ్యాడు. రోహిణితో కలిసి చేసిన స్కిట్, ముసలోడని పెళ్లి చేసుకుంటే.. శోభనం అంటూ వెంటపడటం బాగానే ఉంది. ఇక సుధీర్ స్టైల్లో రోహిణికి ప్రపోజ్ చేశాడు బుల్లెట్ భాస్కర్ తండ్రి. నువ్ చస్తే నన్ను ఏడుస్తాను..కానీ నేను చస్తే నువ్ ఏడ్వొద్దు అంటూ ఇలా ఏదో ప్రపోజ్ చేశాడు. ఇదంతా బాగానే ఉంది.

Bullet bhaskar father about Rashmi Gautam love story in Extra jabardasth SHow

Advertisement

కానీ ప్రోమో చివర్లో మాత్రం రష్మీని బాగా ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తోంది. పదే పదే మీ స్టోరీ ఏంటో చెప్పండని రష్మీని కార్నర్ చేసినట్టు అనిపిస్తోంది. బుల్లెట్ భాస్కర్ స్టోరీలు ఏంటో చెప్పమని రష్మీ అడిగితే.. ఆడి స్టోరీ తరువాతలేండి.. ముందు మీ స్టోరీ ఏంటో చెప్పండని ఆ ముసలాయన అనేస్తాడు. అలా పదే పదే అనేస్తున్నా.. రష్మీ మాత్రం నవ్వుతూనే ఉంటుంది. ఇక బుల్లెట్ భాస్కర్‌కే చిరాకు వచ్చి.. ఆయన దగ్గర్నుంచి మైక్ లాగేసుకోండని అనేస్తాడు. అదే ఒక వేళ బయట ఇలాంటి ప్రశ్నలు అడిగితే.. రష్మీ అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. తామిద్దరం కేవలం ఫ్రెండ్సేనని అంతకు మించి ఏమీ లేదని ఇది వరకు ఎన్నో సార్లు చెప్పింది రష్మీ.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి