Keerthy Suresh following on Soundarya
Keerthy Suresh : సౌత్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ కి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అమ్మానాన్నలిద్దరూ సినిమా ఇండస్ట్రీకి చెందినవారే. నాన్న పెద్ద నిర్మాత. సొంతగా నిర్మాణ సంస్థ ఉంది. ఇక అమ్మ అలనాటి అందాల తార. మెగాస్టార్ చిరంజీవి లాంటి సరసన హీరోయిన్‌గా నటించిన క్రేజ్ ఉంది. ఇలా సినిమా నేపథ్యం ఉన్న కీర్తికి ఇండస్ట్రీలో బాగానే సపోర్ట్ ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే పాపులారిటీ తెచ్చుకుంది. అలా హీరోయిన్‌గా మారి మలయాళ, తమిళ భాషలలో హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తెలుగులో కూడా కీర్తి ఎప్పుడో ఓ సినిమా చేసింది. అడ్డాల చంటి ఈ సినిమాను నిర్మించారు. కాకపోతే, రిలీజ్ కాలేదు. రామ్ సరసన నేను శైలజ సినిమా చేసి ఆకట్టుకున్న కీర్తి ఆ తర్వాత తెలుగులో అజ్ఞాతవాసి, నేను లోకల్, మహానటి సినిమాలు చేసింది.
వీటిలో మహానటి సినిమా కీర్తికి ప్రపంచవ్యాప్తంగా తెచ్చిపెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సన్మానించారు. ప్రశంసలు కురిపించారు. ఇంత క్రేజ్ ఒకేసారి రావడంతో కీర్తికి కమర్షియల్ సినిమాలకంటే ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ గొప్పనుకుంది. అందుకే, వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఒప్పుకొని దెబ్బ తిన్నది. ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలే కాదు, కమర్షియల్ సినిమాలు ఫ్లాపవుతున్నాయి. మహానటి సినిమా తర్వాత ఇప్పటివరకు చేసిన ఏ ఒక్కటీ కీర్తికి హిట్ ఇవ్వలేకపోయాయి. కథల ఎంపికలో రాంగ్ స్టెఒస్ వేస్తుందనే అనుకోవచ్చు. దాంతో కీర్తిలో కొన్ని మార్పులొచ్చాయి. దివంతగ నటి సౌందర్య ఎలా అయితే, తన కెరీర్‌లో సాగిందో ఇప్పుడు కీర్తి కూడా అలాగే ట్రై చేస్తోంది. సౌందర్య మహానటి సావిత్రి తర్వాత పర్ఫార్మెన్స్ పరంగా మళ్ళీ ఆమెనే నేలా పేరు తెచ్చుకుంది.
Keerthy Suresh following on Soundarya
ఇక అవకాశల కోసం గ్లామర్ ఫీల్డ్‌లో ఇలాంటివి తప్పవు అని కెరీర్ ప్రారంభంలో కొన్ని గ్లామర్ రోల్స్ చేసింది. అందుకు ఉదాహరణ నాగార్జున సరసన నటించిన హలో బ్రదర్, రాముడొచ్చాడు వెంకటేశ్ సరసన చేసిన సినిమాలే. మధ్యలో అసలు ఎక్స్ఫోజింగ్ చేసేందుకు సౌందర్య ఒప్పుకోలేదు. కనీసం నడుము చూపించడానికీ ససేమిరా అన్నది. అయితే, ఆ తర్వాత సిమ్రాన్, అంజలా ఝవేరీ, రంభ లాంటి వారొచ్చాక కాస్త అందాల ఆరబోతకు ఒప్పుకుంది. జయం మనదేరా, అన్నయ్య సినిమాలలో సౌంద్రను చూసి అవాక్కయిన వారూ ఉన్నారు. అదే ఇప్పుడు కీర్తి ఫాలో అవుతున్నట్టు అనిపిస్తోంది. సర్కారు వారి పాట సినిమా నుంచి కీర్తి మారినట్టు అనిపిస్తోంది. ఇప్పటి నుంచి గ్లామర్ రోల్స్ ఒప్పుకొని పోటీని తట్టుకోవాలని మళ్ళీ క్రేజ్ బాగా సంపాదించుకోవాలని ప్లాన్ చేసుకుంటోంది. ఏదేమైనా గ్లామర్ గేట్లు ఎత్తేసినట్టే కీర్తి సురేష్ అంటున్నారు.
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.