Home » Entertainment » Bullet Bhaskar Father Remuneration For Jabardast And Sridevi Drama Company
Entertainment

Bullet Bhaskar : బుల్లెట్‌ భాస్కర్‌ నాన్న గెస్ట్‌ అప్పియరెన్స్ కు పారితోషికం ఇస్తారా? లేదా?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 27, 2022, 9:30 pm
Advertisement

Bullet Bhaskar : ఈ మధ్య కాలంలో బుల్లి తెరపై మల్లెమాల వారు చేస్తున్న అన్ని ప్రయోగాలు మరెవ్వరు చేయడం లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ కమెడియన్స్ యొక్క కుటుంబ సభ్యులను తీసుకు వచ్చి వారితో కామెడీ చేయించే ప్రయత్నం మొదలు కొని వారి ఇంట్లో కార్యక్రమాలను కూడా జబర్దస్త్ లేదా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజీల పై నిర్వహించడం అనేది చాలా అరుదైన విషయంగా ప్రేక్షకులు భావిస్తున్నారు. అలాంటి ప్రత్యేక కార్యక్రమాలకు మరియు జబర్దస్త్ కమెడియన్స్ యొక్క కుటుంబ సభ్యులు వచ్చిన ఎపిసోడ్స్ కి మంచి ఆదరణ లభిస్తోంది.

Advertisement

ఈ నేపథ్యంలో మళ్లీ మళ్లీ కుటుంబ సభ్యులను రిపీట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. జబర్దస్త్ టీం లీడర్ గా వ్యవహరిస్తున్న బుల్లెట్ భాస్కర్ యొక్క తండ్రి ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా కనిపిస్తున్నాడు. ఆయన మళ్లీ మళ్లీ షో లో కనిపిస్తున్న నేపథ్యంలో అతనికి కూడా కమెడియన్ హోదా ఇవ్వాలి అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ సమయంలో కొందరు ప్రేక్షకుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవేంటంటే కుటుంబ సభ్యులు రెగ్యులర్‌ గా వస్తున్నారు కదా వారికి ఏమైనా పారితోషికం ఇస్తున్నారా అనేది వారి మధ్య చర్చ.

bullet bhaskar father remuneration for jabardast and sridevi drama company

Advertisement

అసలు విషయం ఏంటంటే వారి కుటుంబ సభ్యులను తీసుకు వచ్చేది కమెడియన్స్ పాపులారిటీ కోసం.. కనుక కుటుంబ సభ్యులకు ఎలాంటి పారితోషికాలు ఇచ్చే అవకాశం లేదు. బుల్లెట్ భాస్కర్ కి మరింత క్రేజ్ దక్కింది అంటే ఆయన తండ్రి ఎంట్రీ ఇచ్చిన తర్వాతే అనడంలో సందేహం లేదు. కనుక బుల్లెట్ భాస్కర్ కి మంచి గుర్తింపు వచ్చి తద్వారా మంచి పారితోషికం వస్తుంది. కనుక ఆయన తండ్రికి పారితోషికం అక్కర్లేదు అనేది మల్లెమాల వారి అభిప్రాయం. వారి ఖర్చులు ఇతర చిన్న చిన్న ట్రావెల్‌ ఖర్చులకు తప్ప మల్లెమాల వారు పారితోషికం ఇచ్చే అవకాశం లేదని సమాచారం అందుతోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి