Bullet Bhaskar : జబర్ధస్త్ షోలో కాంట్రవర్సీలు కొత్తేమి కాదు. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ కొన్ని కాంట్రవర్సీ సబ్జెక్ట్‌లని ఎంచుకొని కామెడీ చేస్తుంటారు. ఒక్కోసారి అవి తేడా కొట్టడంతో సారీ చెప్పక తప్పడం లేదు.గతంలో జబర్దస్త్ కమెడియన్స్ హాస్యం కోసం చేసిన కామెంట్స్, గెటప్స్ వివాదాస్పదం అయ్యాయి. హైపర్ ఆది పంచ్ లపై నిరసనలు వ్యక్తం కాగా పలుమార్లు క్షమాపణలు కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది . బలగం డైరెక్టర్ వేణు మీద గౌడ సామాజిక వర్గం దాడి చేసింది. గీత కార్మికుల మీద జోక్స్ వేస్తూ ఆయన చేసిన స్కిట్ వివాదానికి దారితీసింది . అయితే గతంలో మాదిరిగా జబర్ధస్త్‌కి అంత ఇమేజ్ లేదు. దాని కోసం అందరు కష్టపడుతున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో ఒకరైన బుల్లెట్ భాస్కర్ రిస్క్ చేసి మరీ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.
బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ కమెడియన్ గా, టీం లీడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఒకప్పుడు సునామీ సుధాకర్ ఆయన టీమ్ లో ఉండేవాడు. ప్రస్తుతం ఫైమా, పొట్టి నరేష్ తో స్కిట్స్ చేస్తున్నాడు. బుల్లెట్ భాస్కర్ ఈ మధ్య సమకాలీన పరిస్థితులు, సంఘటనల ఆధారంగా స్కిట్స్ రాసుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంఘటనలు తన స్కిట్స్ లో కామెడీగా ప్రెజెంట్ చేస్తున్నాడు. ఎంటైర్ స్కిట్ కొన్ని వార్తల నేపథ్యంలో నడిపిస్తున్నాడు. తాజాగా బుల్లెట్ భాస్కర్ పర్ఫార్మ్ చేసిన ఓ స్కిట్ హాట్ టాపిక్ అయ్యింది. ఈ స్కిట్ కొద్ది రోజుల క్రితం వైజాగ్ లో ఓ ఇల్లీగల్ వ్యవహారం సంచలనం రేపింది. మోడల్ అండ్ యాక్టర్ అయిన ఓ వ్యక్తి.. భార్య, కూతురుని దూరం పెట్టాడు. మరొక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని ఫ్లాట్ లో కాపురం పెట్టాడు. ఈ విషయం తెలిసిన భార్య కూతురితో పాటు ఆ ఫ్లాట్ ఎదుట బైఠాయించింది. నాకు న్యాయం చేయాలని మీడియాలో కోరుకుంది.
ఈ ఉదంతాన్ని స్కిట్ రూపంలో ప్రదర్శించాడు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఫైమా, పొట్టి నరేష్ స్కిట్ లో ఎప్పటిలాగే నవ్వులు పూయించారు. వాస్తవంగా జరిగిన ఇల్లీగల్ ఎఫైర్ ఉదంతాన్ని స్కిట్ రూపంలో బుల్లెట్ భాస్కర్ చక్కగా ప్రజెంట్ చేశాడు. అయితే ఇలాంటి స్కిట్స్ వలన రిస్క్ కూడా ఉంటుంది. అయిన తెలిసి కూడా బుల్లెట్ భాస్కర్ ఈ సాహసం చేశాడంటే ఆయన షోని ఎంత ముందుకు నడిపించాలని అనుకుంటున్నాడో అర్ధమవుతుంది.
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
This website uses cookies.