Home » Entertainment » Chaitanya Reveal Divorce With Niharika Konidela
Entertainment

Niharika Konidela – Chaitanya : ఇన్ డైరెక్ట్ గా నిహారిక కొణిదెల విడాకుల గురించి బయటపెట్టిన చైతన్య !

Authored By
aruna
The Telugu News | Updated on: July 2, 2023 1:40 pm
Advertisement

Niharika Konidela – Chaitanya : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకులు గురించి న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. దీనికి కారణం నిహారిక, చైతన్య ఒకరినొకరు తమ ఇంస్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి ఫోటోలు డిలీట్ చేశారు. దీంతో అందరికీ అనుమానం వచ్చింది. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని తేల్చేశారు. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి విడాకుల గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై మెగా ఫ్యామిలీ ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయ్యే నాగబాబు నిహారిక విడాకుల విషయంపై వస్తున్న వార్తలకు ఎందుకు చెక్ పెట్టడం లేదో అర్థం కావడం లేదు.

Advertisement

మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో నిజంగానే నిహారిక విడాకులు తీసుకుపోతుందని జనాలు ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా చైతన్య నిహారిక ఎక్కడ కూడా కలిసి కనిపించడం లేదు. నిహారిక ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగానే వెళుతున్నారు. ఇటీవల నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ కి నిహారిక సింగిల్గానే అటెండ్ అయ్యారు. ఆమె వెంట తన భర్త వెంకట చైతన్య లేడు. ఈ క్రమంలోనే విడాకులు ప్రకటించుకున్న నిహారిక చైతన్య విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజాగా వెంకట చైతన్య చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఆయన మహారాష్ట్రలో గల గ్లోబల్ విపాసన మెడిటేషన్ సెంటర్ ని సందర్శించారు. అక్కడ పది రోజులు ఉన్నారు. మానసిక ప్రశాంతత పొందేందుకు ఆ మెడిటేషన్ కి వెళ్లారు. గొప్ప అనుభూతి కలిగిందని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఊహకు మించిన శాంతి లభించిందని ఆయన అభిప్రాయపడ్డారు. నిహారికతో విడాకుల కారణంగా మానసిక వేదనకు గురైన చైతన్య ఆ మెడిటేషన్ సెంటర్ ను సందర్శించారని వాదన మొదలైంది. దీంతో నిజంగానే నిహారిక చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని జనాలు గట్టిగా ఫిక్స్ అయిపోయారు ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ దీనిపై స్పందిస్తే బాగుంటుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి