Home » Entertainment » Charmme Kaur On Puri Jagannadh At Romantic Event
Entertainment

Charmme Kaur : పొద్దున లేస్తే చాలు అదే మాట్లాడతాడు.. పూరిపై ఛార్మీ కామెంట్లు

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 29, 2021, 8:00 am
Advertisement

Charmme Kaur : పూరి జగన్నాథ్ ఛార్మీ మధ్య ఉన్న రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి కథనాలు వస్తుంటాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉందని, అందుకే తన భార్యాపిల్లలకు పూరి దూరంగా ఉంటున్నాడనే టాక్ వినిపిస్తోంది. పూరి ఆయన భార్య లావణ్య గత కొన్ని రోజులు వేర్వేరుగా ఉంటున్నారని తెలుస్తోంది.

Advertisement

Charmme Kaur On Puri Jagannadh At Romantic Event

రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్‌లోనూ పూరి, లావణ్యలు ఎక్కడా కలిసి కనిపించడం లేదు. అయితే ఛార్మీ తాజాగా కొన్ని కామెంట్లు చేసింది.పూరి తన మనసులోని ప్రేమను ఎక్కువగా బయటకు చూపించడు అని తెలిపింది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండపై పూరికి ఉన్న ప్రేమను ఛార్మీ తన మాటల్లో చెప్పింది. రొమాంటిక్ సినిమా కోసం విజయ్ దేవరకొండ రావడంతో ఎంతో సంతోషంగా ఉందని ఛార్మీ చెప్పుకొచ్చింది.

Advertisement

Charmme Kaur : విజయ్ గురించే చెబుతాడు..

Charmme Kaur On Puri Jagannadh At Romantic Event

విజయ్ అంటే మాకు చాలా ఇష్టం. విజయ్‌తో మళ్లీ మళ్లీ పని చేయాలని ఉంది. పూరి అయితే విజయ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. పొద్దున లేవగానే విజయ్ గురించి చెబుతాడు. ఈ రోజు విజయ్‌తో పని చేయబోతోన్నాను అంటూ ఫుల్ ఎనర్జీగా ఉంటాడని పూరి గురించి ఛార్మీ చెప్పుకొచ్చింది. అంతగా విజయ్ అంటే మాకు ఇష్టమని ఛార్మీ పేర్కొంది. దానికి తగ్గట్టే లైగర్ ఉంటుందని తెలిపింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి