charmy kaur stopped the rumors
Charmy Kaur : సినిమా పరిశ్రమలో ఒక మగ, ఆడ కాస్త క్లోజ్ గా ఉంటే వారి మధ్య ఏదో ఒక రిలేషన్ అల్లేస్తుంటారు. సీనియర్ హీరోయిన్ ఛార్మి, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని కొన్నాళ్లుగా ప్రచారం నడుస్తూనే ఉంది. అయితే దీనిపై వారు ఖండిస్తూ ఉన్నా కూడా కొందరు అదే పనిగా ప్రచారాలు చేస్తున్నారు. ఇటీవల వీరి కాంబోలో లైగర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. లైగర్ మూవీ రిలీజ్ మరుసటి రోజు నుంచి సైలెంట్ అయిపోయిన ఛార్మీ.. సోషల్ మీడియాను మాత్రం వీడలేకపోతున్నారు. వీడిపోతున్నాను అంటూ.. చెబుతూనే తన పై… పూరీ పై.. తమ ప్రొడక్షన్ హౌస్ పూరీ కనెక్ట్స్ పై వస్తున్న రూమర్లకు త్రూ..
తన సోషల్ మీడియా హ్యాండిలింగ్స్ కౌంటర్ ఇస్తూ వచ్చింది. ఇటీవల తనకు పూరీకి మధ్య తీవ్ర గొడవలు జరిగాయంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది ఛార్మి. తమపై వస్తున్న వార్తలను రూమర్స్ రూమర్స్ రూమర్స్ అంటూ ట్వీట్ చేసారు ఛార్మి. త్వరలోనే పూరీ కనెక్ట్స్ మళ్లీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం దీనిపైనే ఫోకస్ చేసామని ట్వీట్ లో రాసుకొచ్చారు. తాము అధికారికంగా చెప్పేవరకు ఏదైనా రూమరే అంటూ మరో సారి చెప్పుకొచ్చారు. మొత్తానికి తమ స్నేహం పదిలంగానే ఉందని ఒక్క ట్వీట్‌తో చెప్పకనే చెప్పారు ఛార్మి. అయితే ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పూరీ ఛార్మీల రిలేషన్ షిప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
charmy kaur stopped the rumors
ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడం ఛార్మీ వల్లే అని అన్నారు. లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఛార్మీ వల్లే ఫ్లాప్ అయిందని అంటున్నారని అయితే ఈ రెండూ నిజం కాదని అన్నారు. కథ సరిగ్గా ఎంపిక చేస్తే ఏ సినిమా అయినా హిట్ అవుతుందని చెప్పారు. ఇదిలా ఉంటే పూరీ పక్కన ఛార్మీ ఉంటే హీరోలు సినిమాలు చేయమని చెబుతున్నారంటూ నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. అంతే కాకుండా అందుకే ఇద్దరూ విడిపోతున్నారంటూ కూడా టాక్. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు.అవన్నీ అవాస్తవాలే అని కొట్టి పారేసారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.