Home » Entertainment » Chiranjeevi 153 Movie Launched Grandly
Entertainment

Chiranjeevi 153 Movie : మెగాస్టార్ చిరంజీవి 153 చిత్రం ఘనంగా ప్రారంభం ..!

Authored By
vamana sai
The Telugu News | Published on: January 20, 2021, 6:15 pm
Advertisement

Chiranjeevi 153 Movie : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో నటించబోతున్న 153 వ సినిమా ఘనంగా ఈరోజు ప్రారంభం అయింది. మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్ తెలుగు రీమేక్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నట్టు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముందు ఈ సినిమాకి సాహో ఫేం సుజీత్ దర్శకత్వం వహిస్తాడని అన్నారు. సుజీత్ ఈ ప్రాజెక్ట్ మీద దాదాపు 3 నెలలు వర్క్ కూడా చేశాడు. అయితే సుజీత్ మన తెలుగు నేటివిటీకి.. చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టు స్క్రిప్ట్ లో చేసిన మార్పులు మెగాస్టార్ ని మెప్పించలేకపోయాయి.

Advertisement

chiranjeevi 153 movie launched grandly

Chiranjeevi 153 Movie : వి.వి.వినాయక్ చేతికి చిరంజీవి 153…!

సుజీత్ తర్వాత చిరంజీవి 153 ప్రాజెక్ట్ లోకి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ వచ్చి చేరాడు. ఈ స్క్రిప్ట్ మీద వినాయక్ కూడా కొన్ని నెలలు వర్క్ చేశాడు. కానీ ఇక్కడా సేం సీన్ రిపీటయింది. ఇపటికే చిరంజీవి తో ఠాగూర్, ఖైదీ నంబర్ 150 తీసి సూపర్ హిట్స్ ఇచ్చిన వినాయక్ కూడా లూసీఫర్ తెలుగు రీమేక్ స్క్రిప్ట్ తో మెప్పించలేకపోయాడు.

Advertisement

అందుకే మోహాన్ రాజా కి Chiranjeevi 153 బాధ్యతలు అప్పగించిన చిరంజీవి..!

కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న దర్శకుడు మోహన్ రాజా. చిరంజీవి నటించిన హిట్లర్ సినిమాకి అసోసియేట్ గా .. పనిచేశాడు. అప్పటి నుంచే మోహన్ రాజా గొప్ప దర్శకుడు అవుతాడని మెగాస్టార్ కి గట్టి నమ్మకం. అలాగే తెలుగులో వచ్చిన ధృవ తమిళ వేర్షన్ కి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. అంతేకాదు ఇక్కడ సూపర్ హిట్స్ అందుకున్న సినిమాలని తమిళంలో తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అందుకే ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా మోహన్ రాజా అయితే పర్ఫెక్ట్ అని మెగాస్టార్ ఎంచుకున్నాడు.

కాగా చిరంజీవి 153 ఈరోజు ఫిలిం నగర్ సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ – సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్ వి ఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై మోహన్ రాజా దర్శకత్వంలో ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుండి ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిదే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి