Home » Entertainment » Anasuya Bharadwaj About Breakup
Entertainment

Anasuya : బ్రేకప్‌లపై అనూసయ రియాక్షన్.. ఇలాంటి యాంగిల్ కూడా ఉందా?

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: January 20, 2021 8:11 pm
Advertisement

అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ట్రోలింగ్‌కు ఎక్కువగా గురయ్యే సెలెబ్రిటిల్లో అనసూయ ముందు వరుసలో ఉంటుంది. అనసూయ కూడా కావాలనే గెలికే ఉద్దేశ్యంలో కొన్ని పోస్ట్‌లను పెడుతుంది. అనసూయ పెట్టే పోస్ట్‌ల్లో కొన్ని అనాలోచితంగా పెట్టినవి ఉంటాయి.. ఇంకొన్ని అందరిలోనూ ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయి. అలా అనసూయ నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి.

Advertisement

Anasuya Bharadwaj About Breakup

అనసూయ బుల్లితెరపై లేదంటే వెండితెరపై అప్పుడప్పుడు రచ్చ చేస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అనసూయ నిత్యం రచ్చ చేస్తుంది. అనసూయ ట్వీటేసిన, ఫోటో షేర్ చేసినా.. ఏది చేసినా కూడా వైరల్ అవుతూనే ఉంటుంది. అలా అనసూయ గత వారం రోజులుగా రచ్చ చేయడం లేదు. ఆ మధ్య ఒకసారి కరోనాలక్షణాలున్నాయని పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకొస్తూ ఓ పోస్ట్ చేసింది.

Advertisement

ఆ తరువాత మళ్లీ అనసూయ పోస్ట్‌లు చేయలేదు. అలా అనసూయ హడావిడి సోషల్ మీడియాలో కాస్త తగ్గింది. అయితే అనసూయకు ఇప్పుడు కరోనా నెగెటివ్ వచ్చినట్టుంది. క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నట్టుంది. ఈ క్రమంలో అనసూయ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఈ క్రమంలో నెటిజన్లు అడిగిన క్రేజీ ప్రశ్నలకు మరింత క్రేజీగా ఆన్సర్స్ ఇచ్చింది. అందులో ఓ నెటిజన్ బ్రేకప్ జరిగితే ఎలా తీసుకోవాలో చెప్పండని కోరాడు. దీనికి అనసూయ స్పందిస్తూ.. నీకు ఆమె.. ఆమెకు నువ్ కరెక్ట్ అయితే అసలు బ్రేకప్ జరగదు.. ఒకవేళ ఆమె నీకు రైట్ అని తెలిస్తే.. ఆ బంధాన్ని గట్టిగా ఉంచేందుకుఏం చేయాలో కూడా నీకు తెలుస్తుందంటూ అనసూయ లవ్ గురూ అయిపోయింది. ఎంతైనా అనసూయ ప్రేమ పెళ్లి చేసుకుంది కాబట్టి ఈ మాత్రం అనుభవం ఉంటుంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి