Ram Charan Child Name : రామ్ చరణ్ బిడ్డకు అప్పుడే పేరు ఫిక్స్ చేసేసిన చిరంజీవి.. సేమ్ అదే సెంటిమెంట్ తో పేరు పెట్టారు
Ram Charan Child Name : గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియా,Social media,లో ఎక్కడ చూసినా అదే చర్చ. ఒకటే పేరు మారుమోగిపోతోంది. అదే మెగా వారసుడు. పుట్టబోయేది అమ్మాయినా.. అబ్బాయా అనేది పక్కన పెడితే.. రామ్ చరణ్,Ram Charan, తండ్రి కాబోతున్నాడు.. చిరంజీవి, Chiranjeevi, తాత కాబోతున్నారు అనే విషయం తెలిసినప్పటి నుంచి మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా చాలా ఆనందంలో మునిగిపోతున్నారు. మెగా ఇంట సంబురాలు ప్రారంభం అయ్యాయి. గత పదేళ్ల నుంచి మెగా ఫ్యాన్స్, Mega fans, ఈ గుడ్ న్యూస్, Good news, కోసం వెయిట్ చేస్తున్నారు.
ఏకంగా మెగాస్టార్ చిరంజీవే ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు. మెగా వారసుడు వస్తున్నట్టు ట్వీట్ చేశారు. దీంతో సినీ సెలబ్రిటీలతో పాటు.. మెగా అభిమానులు కూడా మెగాస్టార్ చిరంజీవికి, రామ్ చరణ్, ఉపాసన , Ram Charan, Upasana, దంపతులకు కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నారు. మెగా ఫ్యామిలీ, Mega Family, ని ఈ సందర్భంగా ట్రెండ్ చేస్తున్నారు. అయితే రామ్ చరణ్,Ram Charan కు పుట్టబోయేది కొడుకేనని.. అతడు ఖచ్చితంగా మెగా వారసుడు అని తండ్రి, తాతను మించి పోయే రేంజ్ లో ఉంటాడనే ఒక న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
chiranjeevi fixed ram charan child name before birth
Ram Charan Child Name : పుట్టబోయేది కొడుకేనా?
అందుకే.. ముందే మెగా వారసుడి పేరు కూడా డిసైడ్ చేశారట చిరంజీవి. ప్రతి ఒక్కరి పేరు వెనుకాలా తేజ్ అనే ఒక సెంటిమెంట్ మెగా ఫ్యామిలీలో ఉంటుంది తెలుసు కదా. అలాగే చిరంజీవి ఆంజనేయ స్వామి భక్తుడు. ఏ విషయాన్ని అయినా సరే.. ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకున్నాకే అందరికీ చెబుతారు. అందుకే.. తన ఇష్ట ఆరాధ్య దైవం అయిన ఆంజనేయ స్వామి పేరు కలిసి వచ్చేలా.. అంజన్ తేజ్ అని పెట్టాలని అనుకుంటున్నారట. ఆ పేరు మెగా ఫ్యాన్స్ కు కూడా నచ్చిందట. ఈ పేరు సూపర్బ్ గా ఉంది అంటూ మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
