chiranjeevi looks pawan kalyan fan
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అడుగు జాడల్లోనడుస్తూ పవర్ స్టార్‌గా అశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు పవన్ కళ్యాణ్. ఈయనకి సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ అంటే పడిచచ్చే అభిమానులు కూడా ఆయనకు ఉన్నారు. అయితే చిరంజీవి.. పవన్ కళ్యాణ్ అభిమానిగా నటిస్తున్నాడంటూ ఓ ప్రచారం జరుగుతుంది. వివరాలలోకి వెళితే.. చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ”భోళా శంకర్” ఒకటి. ఇది తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాళమ్’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
రీమేక్ అయినప్పటికీ దర్శకుడు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అనేక మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ‘స్వాగ్ ఆఫ్ భోళా’ పేరుతో విడుదల చేసిన గ్లిమ్స్ కు మెగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే చిరు ‘భోళా శంకర్’ చిత్రంలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపిస్తారట. ఈ నేపథ్యంలోనే సినిమాలో పవన్ నటించిన ‘ఖుషి’ సీన్ ని రిపీట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ – భూమిక ల మధ్య వచ్చే నడుము సీన్ ఎంత హైలైట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అదే సన్నివేశాన్ని ‘భోళా శంకర్’ లో స్పూఫ్ గా వాడుతున్నారట.
chiranjeevi looks pawan kalyan fan
చిరంజీవి – యాంకర్ శ్రీముఖి మధ్య ఆ సీన్ రాబోతుందని అంటున్నారు. మెగాస్టార్ రేంజ్ ఏంటి.. తన తమ్ముడు పవన్ కు ఫ్యాన్ గా నటించడం ఏంటి.. ‘ఖుషి’ నడుము సీన్ స్పూఫ్ లో నటించడం ఏంటని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరి మెహర్ రమేష్ ఆ రొమాంటిక్ సన్నివేశాన్ని సినిమాలో ఉంచుతారో లేదో చూడాలి. ఇకపోతే సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘భోళా శంకర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తోంది. చిరు సోదరిగా మహానటి కీర్తి సురేష్ కనిపించనుంది. రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైనెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
This website uses cookies.