Venu sriram : వేణు శ్రీరాం పేరు ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మార్మోగిపోతోంది. అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ సినిమాకి దర్శకుడు కావడమే. వేణు శ్రీరాం దర్శకుడిగా పరిచయం అయింది ఓ మై ఫ్రెండ్ సినిమాతో. ఈ సినిమా 2011 లో వచ్చింది. దాదాపు పదేళ్ళు అయినప్పటికీ వేణుశ్రీరాం చేసింది కేవలం రెండు సినిమాలే. ఓ మై ఫ్రెండ్ తర్వాత మళ్ళీ నాని – సాయి పల్లవితో ఎం.సి.ఏ సినిమా చేశాడు. వీటిలో డెబ్యూ సినిమా భారీ ఫ్లాపవగా రెండవ సినిమా యావరేజ్ టాక్ దగ్గర ఆగిపోయింది.
ఇక ఈ రెండు సినిమాలు దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కించాడు వేణు శ్రీరాం. కాగా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ కి దర్శకుడిగా దిల్ రాజు బాధ్యతలు అప్పగించడం అందరికీ షాకిచ్చింది. కానీ ఇప్పుడు వేణు శ్రీరాం వాళ్ళందరికీ షాకిచ్చాడు. వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ ని సత్య దేవ్ పాత్రలో ఇంత పవర్ ఫుల్ గా చూపిస్తాడని ఏ ఒక్కరు భావించలేదు. ఇప్పుడు వకీల్ సాబ్ ఇంత పెద్ద హిట్ అయిందంటే ఆ క్రెడిట్ మొత్తం వేణు శ్రీరాం కే దక్కుతోంది. అంతగా తనలోని సత్తాని బయట పెట్టి తనని తాను నిరూపించుకున్నాడు.
ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ మీద అలాగే దర్శక, నిర్మాతలు చిత్ర యూనిట్ సభ్యులందరినీ గొప్పగా ప్రశంసించారు. ఈ క్రమంలో దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరాం లను ప్రత్యేకంగా అభినందించాడు. ఈ క్రమంలోనే దర్శకుడు వేణు శ్రీరాం కి మెగా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. స్వయంగా మెగాస్టారే.. ” వేణు శ్రీరాం ని నాతో సినిమా చేస్తావా”.. అని అడిగారట. అంతేకాదు ఈ సినిమాకి నిర్మాతగా చరణ్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తే బావుంటుందని సూచించారట మెగాస్టార్. ప్రస్తుతం ఈ టాపిక్ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది.
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
This website uses cookies.