Home » Entertainment » Chiranjeevi Took Gang Ledar Movie Which Was Came To Nagababu
Entertainment

Chiranjeevi : తమ్ముడి అవకాశాన్ని కొట్టేసిన చిరంజీవి.. ఎలాగంటే?

Authored By
mallesh
The Telugu News | Published on: August 23, 2022, 7:20 pm
Advertisement

Chiranjeevi : అవును మీరు విన్నది తన తమ్ముడు చేయాల్సిన సినిమాను చిరంజీవి గారు చేసి అప్పట్లో గ్యాంగ్ లీడర్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత చిరు మాస్ ఇమేజ్ మరింత పెరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ సినిమాలో చిరంజీవి క్యారెక్టరైజేషన్, అందులోని డ్యాన్సులు,సాంగ్స్ అన్ని సూపర్ హిట్. గ్యాంగ్ లీడర్ సినిమాను ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేసిన ఫ్యాన్స్ ఎగబడి మరీ చూస్తారు.

Advertisement

Chiranjeevi : నాగబాబే అన్నకోసం వదులుకున్నాడా..

చిరంజీవి కష్టపడి ఏర్పాటు చేసిన ఒక ప్లాట్ ఫాంపై తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. తన తమ్ముళ్లను ఎలాగైనా హీరోలు చేయాలని చిరంజీవి ఎంతో శ్రమపడ్డాడట.. ఈ క్రమంలోనే నాగబాబును కోండవీటి దొంగ సినిమాలో సైడ్ క్యారెక్టర్‌లో ముందు పరిచయం చేశాడు. ఆ తర్వాత నాగబాబు కటౌట్ చూసి పరుచూరి బ్రదర్స్ అరే ఓ సాంబ పేరుతో మంచి స్క్రిప్ట్ రెడీ చేశారట.. అయితే, కథ బలంగా ఉండటం, పెద్ద బడ్జెట్‌లో ఈ సినిమా చేయాలని దర్శకుడు విజయబాపినీడు అనుకున్నాడట. కానీ ఈ సినిమా స్టోరీని విన్న నాగబాబు బాగుందని చెప్పాడు.

Chiranjeevi Took Gang Ledar Movie Which Was Came To Nagababu

Advertisement

నిర్మాతలు మాత్రం కొత్త హీరో కోసం ఇంత డబ్బులు పెట్టలేమని చెప్పేశారట.. దీంతో నాగబాబు ఈ కథను తన అన్నతో చేయాలని సూచించారట.. దాంతో దర్శకుడు మళ్లీ చిరును కలిసి ఈ సినిమా స్టోరీ చెప్పగా చిన్న చిన్న మార్పులు చేయాలని, అంతేకాకుండా సినిమా పేరు మార్చాలని చెప్పారట.. అప్పుడు అరే ఓ సాంబ మూవీ పేరు కాస్త గ్యాంగ్ లీడర్ అని మార్చి సినిమా తీశారు. ఇక ఈ సినిమా విడుదలయ్యాక చిరులోని మాస్ నటనకు , ఫైటింగ్స్‌కు జనాలు బ్రహ్మరథం పట్టారు. అంతేకాకుండా విజయశాంతి నటన కూడా ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఇలా గ్యాంగ్ లీడర్ నాగబాబు కావాల్సింది అనుకోకుండా చిరంజీవి అయ్యాడు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి