GodFather Movie : మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా తో అక్టోబర్ 5వ తారీకున దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. గాడ్ ఫాదర్ సినిమా మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్ కి రీమేక్ అనే విషయం కూడా అందరికి తెల్సిన విషయమే. రీమేక్ అంటే ఉన్నది ఉన్నట్లుగా తీయడం అంటూ గతంలో ఒక అభిప్రాయం ఉండేది. కాని భీమ్లా నాయక్ సినిమా తో ఆ అభిప్రాయంను పవన్ మార్చేశాడు. వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమాలను ఒరిజినల్ కు పూర్తి గా మార్చేసి కమర్షియల్ సినిమాల మాదిరిగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే.
ముఖ్యంగా భీమ్లా నాయక్ సినిమా ను ఒరిజినల్ అయ్యప్పనుమ్ కోషియుమ్ కు ఏమాత్రం తగ్గకుండా రూపొందించడంతో పాటు పూర్తిగా కమర్షియల్ హంగులు అద్దాడు. వకీల్ సాబ్ సినిమా ను కూడా మార్చేశాడు. పవన్ చేసిన ఈ రెండు రీమేక్ ల సాహసం ను మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ కి చేయలేక పోయాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. లూసీఫర్ ను ఉన్నది ఉన్నట్లుగా దాదాపుగా 98 శాతం సేమ్ చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది.
కొన్ని సన్నివేశాలు మినహా మొత్తం కథ అంతా కూడా సేమ్ ఉంచడంతో పాటు సినిమాకు సంబంధించిన స్క్రీన్ ప్లే ను కూడా మార్చలేదు అంటున్నారు. తాజాగా విడుదల అయిన టీజర్ ను చూస్తూ ఉంటే లూసీఫర్ ను తెలుగు వర్షన్ లో చూసినట్లుగానే అనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. రీమేక్ చేస్తే మార్పులు చేర్పులు చేసి తీసుకు వస్తే ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది క్లారిటీ లేదు. అందుకే లూసీఫర్ ను ఉన్నది ఉన్నట్లుగానే మార్చకుండా గాడ్ ఫాదర్ గా తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. గాడ్ ఫాదర్ ను ఉన్నతి ఉన్నట్లుగా తీసుకు రావడం వల్ల ఎంత వరకు చిరంజీవి సఫలం అవుతాడు.. సక్సెస్ అవుతాడు అనేది చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.