Waltair Veerayya Movie : చిరంజీవి లేటెస్ట్ సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాను బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో బాస్ పార్టీ పాట విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో చాలా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కథ ఇదే అంటూ ఓ స్టోరీ వార్తల్లో నిలిచింది.
ఒకవేళ ఈ కథ నిజం అయితే మెగాస్టార్ హిట్ కొట్టడం పక్కా అని తెలుస్తుంది. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటంటే ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక భార్యకి పుట్టిన కొడుకు వీరయ్య. రెండో భార్యకి పుట్టిన కొడుకు రవితేజ. వీరయ్య ఆంధ్రాలో కార్మిక సంఘానికి నాయకుడుగా ఉంటాడు. రవితేజ పోలీస్ అవుతాడు. ఒక సమయంలో వీరిద్దరి మధ్య గొడవ అవుతుందు. వీరిద్దరి మధ్యలో వచ్చిన విలన్ కి వీళ్ళకి మధ్య చాలా కథ నడుస్తుంది. విలన్ వచ్చాక వీరయ్య, రవితేజ మధ్య ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, వీరిద్దరు మళ్ళీ కలుస్తారా లేదా అనే అంశంపై ఈ కథ నడుస్తుంది.
వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ పేరుతో చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక చిరంజీవికి తండ్రి పాత్రలో సత్యరాజ్ నటిస్తున్నారు. ఇక సత్యరాజ్ చిరంజీవికి రవితేజ కి తండ్రి అవుతాడు. అలాగే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక చిరంజీవి ఈ సినిమాలో గోదావరి యాసలో మాట్లాడుతున్నారు అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఒకవేళ ఈ కథ కనుక నిజమైతే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఇంతకు ఈ సినిమా కథ ఇదేనా కాదా అని తెలియాలంటే సినిమా విడుదలయ్యే దాకా వేచి చూడాలి. అదే కనుక నిజమైతే మెగాస్టార్ మంచి సక్సెస్ ను అందుకుంటారు.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.