Comedian Satires on Actress Pragathi Workouts
Actress Pragathi : ప్రగతి ఆంటి.. ఇటీవలి కాలంలో ఎంత సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో కనిపించి మెప్పించిన ప్రగతి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. ప్రగతి.. తెలుగులోనే కాదు.. సౌత్ భాషలు అన్నింటిలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓ మార్క్ క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకువెళ్తోంది. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్ 3’ చిత్రంలో ప్రగతి తన నటనతో అందరినీ నవ్వించిన ఆమె మరిన్ని సినిమాలను తన కిట్టీలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’లో కనిపించనున్నారు ప్రగతి.
ప్రగతి సినిమాలో ఎంత పద్ధతిగా కనిపిస్తుందో..బయట అంత బోల్డ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆమె వర్క్ అవుట్ వీడియోలు చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. యంగ్ హీరోయిన్స్ కూడా చేయలేని…విధంగా హాట్ పర్ ఫామెన్స్ లతో..కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. అంతలా పవర్ ఫుల్ వర్క్ అవుట్ వీడియోలు చేస్తుంది. అంతేనా, ఇన్స్టా లో తనకు నచ్చిన రీల్స్ కూడా చేస్తూ..ట్రెండీ వేర్ లో డ్రెస్లు వేస్తుంటుంది. అయితే ప్రగతి ఈ మధ్య సినిమాలలోనే కాదు బుల్లితెరపైన సందడి చేస్తుంది. పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ రచ్చ చేస్తుంది. ఆ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిసిన ప్రగతి ఇప్పుడ జబర్ధస్త్ లోను కనిపించి సందడి చేసింది.
Comedian Satires on Actress Pragathi Workouts
కమెడియన్ నూకరాజు, దొరబాబు కలిసి సూర్యవంశం మూవీ పేరడీ చేయగా, ఇది నవ్వులు పూయిస్తుంది. ఈ స్కిట్ లో దొరబాబు పెద్ద వెంకటేష్ పాత్రలో నటించాడు. నేను నా పెద్ద కొడుకుని పోలీస్ చేశా.. రెండో కొడుకుని లాయర్ ని చేశా.. ఎందుకో తెలుసా అని దొరబాబు అడుగుతారు. దీనికి నూకరాజు బదులిస్తూ.. నాకు తెలుసు మీరు ఎక్కడైనా దొరికేస్తారు అంటూ దొరబాబు సెక్స్ రాకెట్ వ్యవహారం గుర్తొచ్చేలా సెటైర్ వేసారు. దీనితో ప్రగతి, ఇంద్రజ నవ్వు ఆపుకోలేకపోయారు. ఇక రాఘవ జిమ్ వర్కౌట్లు చేస్తూనే ప్రగతితో మాట్లాడుతూ ఉంటాడు. కాసేపటికి రాఘవ అలసిపోతాడు. పక్కనే ఉన్న వ్యక్తి.. అందుకే ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చేయాలి అని అంటాడు. దీనితో రాఘవ.. ప్రగతి గారిని పట్టుకుని అంత మాట అంటావా అని చెప్పగా, అది అన్నది ఆవిడను కాదు నిన్ను అనగానే అందరు నవ్వేస్తారు.వీడియో వైరల్‌గా మారింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.