Home » Entertainment » Comedian Venu Madhav Mother Serious Comments About Her Son
Entertainment

Venu Madhav Mother : నా కొడుకు అలా చెయ్యకుండా ఉండి ఉంటే బ్రతికేవాడు , వేణుమాధవ్ తల్లి సీరియస్ కామెంట్స్ ..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: February 1, 2023 8:35 pm
Advertisement

Venu Madhav Mother : కమెడియన్ గా వేణుమాధవ్ కి తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఎన్నో సినిమాలలో కమెడియన్ పాత్రలు చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న వేణుమాధవ్ ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో కమెడియన్గా చేసాడు. కోదాడ నుంచి సాధారణ మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన కెరీర్ను మొదలుపెట్టిన వేణుమాధవ్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ రేంజ్ కి ఎదిగాడు. ఇండస్ట్రీ లోకి వచ్చి ఎంత త్వరగా స్టార్ గా మారాడో, అంతే త్వరగా తన జీవితాన్ని ముగించేసుకున్నాడు వేణుమాధవ్.

Advertisement

Comedian Venu Madhav Mother serious comments about her son

కొన్ని అనారోగ్య కారణాల చేత వేణుమాధవ్ మృతి చెందారు. అయితే అప్పటికి ఆస్తులు బాగా సంపాదించుకున్న వేణుమాధవ్ ఇప్పటికి జనాల చిరస్థాయిలో నిలిచిపోయాడు. అయితే రీసెంట్గా వేణుమాధవ్ తల్లి సావిత్రమ్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టారు. సావిత్రమ్మ మాట్లాడుతూ నాకు ముగ్గురు మగ పిల్లలు. వేణుమాధవ్ చిన్నప్పటినుంచి చాలా యాక్టివ్ గా ఉండేవాడు. మిమిక్రీ బాగా చేసేవాడు. అప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గారు చూసి సినిమాలో అవకాశాలు ఇచ్చారు. ఆ అవకాశాన్ని వేణుమాధవ్ బాగా ఉపయోగించుకున్నాడు.

Advertisement

Comedian Venu Madhav Mother serious comments about her son

కానీ చిన్న వయసులోనే అర్థాంతరంగా మరణించాడు. వేణుమాధవ్ కి ఉన్న ఆ చెడ్డ అలవాటే ఆయన ప్రాణాలను తీసేసిందని సావిత్రమ్మ గారు చెప్పుకొచ్చారు. ఎప్పుడు ఏ జబ్బు వచ్చినా మందులు వేసుకునే వాడు కాదు. చిన్నప్పటి నుంచి అదే అలవాటు వచ్చింది. ఈ క్రమంలోనే పెద్దయిన తర్వాత కూడా మందులు వేసుకోక పోవడం వలన ఆరోగ్యం మరింత క్షీణిచిందని అదే తనని ప్రాణాలను తీసేసిందని సావిత్రమ్మ చెప్పారు. అయితే వేణుమాధవ్ కోట్లకు కోట్ల సంపాదించాడు కానీ ఆయన తల్లి సావిత్రమ్మ ఇప్పుడు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి