Do you know what this man did when he was angry that Karthika Deepam Serial
Karthika Deepam Serial : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ సీరియల్ కార్తీకదీపం. తెలంగాణలో జరిగిన ఓ సంఘటనతో ఈ సీరియల్ కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కి ఫుల్ ఫాన్స్ ఉన్నారు. ఈ సీరియల్ లో నటించిన డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత, సౌందర్య చిన్నపిల్లల పాత్రలకు జనాలకు బాగా నచ్చేసాయి. అందుకే ఈ సీరియల్ సూపర్ హిట్ అయింది. ఈ సీరియల్ కేవలం ఆడవాళ్లు మాత్రమే కాదు ఇంట్లోనే మగ వాళ్లకు కూడా ఈ సీరియల్ అంటే ఇష్టం. ఎలా అంటే ఈ సంఘటన గురించి తెలిస్తే
Do you know what this man did when he was angry that Karthika Deepam Serial
ఈ సీరియల్ కు మగవాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నారా అని ఆశ్చర్యపోతారు. అయితే కార్తీకదీపం సీరియల్ ఇటీవల అయిపోయింది. అయితే ఈ సీరియల్ చూడనివ్వడం లేదని ఓ వ్యక్తి ఏం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు. ఈ వింత ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. గత నెలలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామానికి చెందిన గట్టు మొగిలి కిరాణా కొట్టును నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన తాళ్లపల్లి వెంకటయ్య గత నెల 23న రాత్రి మద్యం తాగి అరువు కోసం మొగిలి కొట్టుకు వెళ్లాడు.
Do you know what this man did when he was angry that Karthika Deepam Serial
ఆ సమయంలో కార్తీక దీపం సీరియల్ చూడడంలో లీనమైపోయాడు మొగిలి. సీరియల్ అయిపోయాక అప్పు ఇస్తానని చెప్పిన వెంకటయ్య వినిపించుకోకుండా పదేపదే విసిగించసాగాడు. దీంతో కోపం వచ్చిన మొగిలి వెంకటయ్య పై దాడి చేసి అతని వేలు కొరికాడు. దీంతో వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. పోలీసులు మొగిలిని విచారించగా అతడు కార్తీకదీపం సీరియల్ చూడనివ్వకుండా విసిగించాడని అందుకే వేలు కొరికాను అని చెప్పాడు. దీంతో పోలీసులు షాక్ అయిపోయారు. పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. సీరియల్స్ ప్రభావం జనాలపై ఎంత ప్రభావం పడుతుందో ఈ ఘటనతో అర్థం అవుతుంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.