Home » Entertainment » Comments And Trolls On Mahesh Babu Beard In Social Media
Entertainment

Mahesh Babu : మహేష్ బాబు గడ్డంపై కామెంట్స్… వద్దు బాబోయ్ ఈ గడ్డం వద్దు

Authored By
aruna
The Telugu News | Published on: August 3, 2022, 8:30 am
Advertisement

Mahesh Babu : కొంత మంది హీరోలను కొన్ని లుక్ ల్లో మాత్రమే చూడాలని మనం కోరుకుంటాం.. అలా కాకుండా వేరే విధంగా కనిపిస్తే కచ్చితంగా ఆ హీరో అభిమానులు మాత్రమే కాకుండా ప్రేక్షకులంతా కూడా ఒక రకంగా చూస్తారు. ప్రస్తుతం మహేష్ బాబు పరిస్థితి అలాగే ఉంది. మహేష్ బాబు తాజాగా ఒక ఫోటోలో గడ్డం తో కనిపించాడు. ఆ గడ్డం మరి బారుగా ఏమీ లేదు. గతంలో పవన్ కళ్యాణ్ భారీ గడ్డం పెంచినట్లు గా మహేష్ బాబు ఇప్పుడు అంతగా ఏం పెంచలేదు. అయినా కూడా మహేష్ బాబు ని గడ్డం లుక్ లో చూడలేక పోతున్నాము అంటూ ఎంతో మంది ఎన్నో రకాలుగా కామెంట్స్ చేస్తూ, ఆయన్ని తీవ్రంగా ట్రోల్స్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

సోషల్ మీడియాలో ప్రస్తుతం మహేష్ బాబు లుక్‌ గురించి ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. మహేష్ బాబు ని గడ్డంలో కొందరు ఇష్టపడితే మరి కొందరు మాత్రం అస్సలు బాలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. 20 సంవత్సరాల నుండి మహేష్ బాబుని గడ్డం లేకుండా చూశాము. ఇప్పుడు కూడా గడ్డం లేకుండానే చూడాలనుకుంటున్నాం. గడ్డం తో మహేష్ బాబుని చూడడం వల్ల ముసలాడు అయ్యాడు అనే అభిప్రాయం ఉందని, కనుక మహేష్ బాబు గడ్డం లేకుండా చూడడం మాకు ఇష్టం అంటూ అభిమానులు చెబుతున్నారు.

Comments and trolls on Mahesh babu beard in social media

Advertisement

మహర్షి సినిమాలో కాస్త గడ్డంతో కనిపించే ప్రయత్నం చేశాడు, కానీ పెద్దగా నప్పలేదు అందుకే నార్మల్‌ గానే ఆ సినిమాలో కనిపించాడు. మహేష్ బాబు గడ్డం ను ప్రస్తుతం సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ఒక స్థాయి ట్రోల్స్ చేస్తున్నారు. దాంతో మహేష్ బాబు అభిమానులు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారు. వారు కూడా తిరిగి కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మహేష్బాబు లుక్‌ వారికి కూడా పెద్దగా నచ్చినట్టు లేదు. అందుకే గతంలో మాదిరిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వకుండా నార్మల్గా యాంటీ ఫ్యాన్స్ ని లైట్ తీసుకుంటున్నారు. మహేష్ బాబు ఇంకెప్పుడూ ఇలా గడ్డం కనిపించదని అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి