Home » Entertainment » Conductor Jhani Emotional On Jabradasth Starge
Entertainment

Conductor Jhani : కంటతడి పెట్టుకున్న కండక్టర్ ఝాన్సీ.. జబర్దస్త్ స్టేజ్‌పై ఎమోషనల్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: September 22, 2022 4:49 pm
Advertisement

Conductor Jhani : కండక్టర్ ఝాన్సీ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగిపోతూనే ఉంది. ఎక్కడో రికార్డులు డ్యాన్సులు వేసుకుంటూ ఉండే కండక్టర్ ఝాన్సీ.. ఇప్పుడు బుల్లితెరపై ఓ సెన్సేషన్. పల్సర్ బైక్ పాట, ఝాన్సీ స్టెప్పులు రెండూ తెలియని వాళ్లు ఎవ్వరూ లేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పల్సర్ బైక్ పాట మార్మోగిపోతోంది. ఇక కండక్టర్ ఝాన్సీ వేసిన మూమెంట్స్ అందరినీ అలరిస్తూనే ఉన్నాయి. శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఎప్పుడైతే పల్సర్ బైక్ పర్ఫామెన్స్‌కు సంబంధించిన ప్రోమో వచ్చిందో..

Advertisement

అందులో గాజువాక డిపో కండెక్టర్ అని చెప్పిందో.. అప్పటి నుంచి ఝాన్సీ పేరు మార్మోగిపోతూనే ఉంది. ఆ తరువాత ఝాన్సీ ఇది వరకు చేసిన డ్యాన్స్ వీడియోలు, రికార్డింగ్ డ్యాన్స్ వీడియోలు కోకొల్లలుగా నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆమె స్టెప్పులు ఎక్కడో చోట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఆమె తన జీవితంలోని విషాద ఘటనలు, అవమానపడ్డ క్షణాలను చాలానే చెప్పుకొచ్చింది. తన భర్త కూడా డ్యాన్సర్ అని, తన భర్త సాయం వల్లే ఈ స్థాయి వరకు వచ్చానంటూ ఝాన్సీ చెప్పుకొచ్చింది.

Conductor Jhani Emotional on Jabradasth Starge

Advertisement

ఒకప్పుడు అందరూ ఎగతాళి చేసేవారని, పరువుతీస్తున్నావని అనేవారట. ఇలా డ్యాన్సులు చేసుకుంటూ పరువంతా తీస్తున్నావని బందువులు అనేవారట. కానీ తాను కష్టపడి తన తమ్ముడిని కూడా చదివించుకున్నాని అంటుంది ఝాన్సీ. ఇక తాజాగా జబర్దస్త్ స్టేజ్ మీదా ఝాన్సీ మెరిసింది. ఇంత వరకు తమను అవమానించిన వారే ఫోన్ చేసి.. మా పరువు నిలబెట్టావ్ అని ఫోన్ చేస్తున్నారు అని చెబుతూ స్టేజ్ మీదే కుప్పకూలిపోయి ఎమోషనల్ అయింది. స్టేజ్‌కు వినమ్రంగా నమస్కరించేసింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి