Home » Entertainment » Anushka Shetty Entertain With Balayya
Entertainment

Anushka Shetty : అనుష్క‌తో బాల‌య్య సంద‌డి.. ఇక ర‌చ్చ మాములుగా ఉండ‌దేమో మ‌రి…!

Authored By
Sam C
The Telugu News | Published on: September 22, 2022, 7:00 pm
Advertisement

Anushka Shetty : నంద‌మూరి అంద‌గాడు బాల‌కృష్ణ హంగామా మాములుగా లేదు. ఒక‌వైపు సినిమాలు మ‌రోవైపు టీవీ షోస్‌తో తెగ సంద‌డి చేస్తున్నాడు. బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోతో కూడా త‌న క్రేజ్ అమాంతం పెంచేసుకున్నాడు.ఈ షో క్రియేట్ చేసిన సెన్సేష‌న్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాలయ్య‌లో కొత్త కోణం ఆవిష్క‌రిపంజేసిన ఈ షోకి ఇప్పుడు కొన‌సాగింపుగా రెండో సీజ‌న్ స్టార్ట్ కాబోతుంది. ఇందుకు సంబంధించి క‌స‌ర‌త్తులు న‌డుస్తున్నాయి. ఆహా వాళ్లు కూడా త్వ‌ర‌లోనే సీజ‌న్ 2 స్టార్ట్ అవుతుంద‌ని క్లారిటీ ఇవ్వ‌డంతో ఇటు సీజ‌న్ 2లో పాల్గొనే వారి లిస్ట్ కూడా ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. సీజ‌న్ 2లో చిరంజీవి, వెంక‌టేష్ లాంటి స్టార్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి.

Advertisement

ఇక ఇప్పుడు అనుష్క పేరు కూడా లైన్లో కి వ‌చ్చింది. టీవీ షోల‌లో పెద్ద‌గా క‌నిపించ‌ని అనుష్క ఇప్పుడు బాల‌య్య షోకి రాబోతుంద‌ని అనే స‌రికి అంద‌రు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. నిశ్శ‌బ్ం త‌ర్వాత మ‌రో సినిమా చేయ‌ని ఈ అమ్మ‌డు న‌వీన్ పోలిశెట్టి సినిమాలో మాత్రం న‌టిస్తోంది. అయితే ఈ అమ్మ‌డు బాల‌య్య వేసే ప్ర‌శ్న‌లని ఎలా ఎదుర్కొంటుంది అనేది హాట్ టాపిక్‌గా మారింది. గ‌తంలో వైవీఎస్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఒక్క‌మ‌గాడు సినిమాలో బాల‌య్య‌కు జోడీగా అనుష్క న‌టించింది. ఆ సినిమా ప్లాప్ కావ‌డంతో ఇద్ద‌రు క‌లిసి న‌టించ‌లేదు. బాలకృష్ణ కథానాయకుడిగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది.

Anushka Shetty entertain with balayya

Advertisement

Anushka Shetty : ఆల్ ఆర్ వెయిటింగ్..

రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నాడు. తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ కి సంబంధించిన కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతూ ఉండగానే, పూరి జగన్నాథ్ తో చేయడానికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. గతంలోనే పూరితో బాలయ్య ‘పైసా వసూల్’ చేశారు. పూరితో మరో సినిమా చేస్తానని అప్పుడే ఆయన మాట ఇచ్చారు. ఆ మాటకి కట్టుబడే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి